చైనా కంపెనీలు కొత్త కొత్త పద్ధతిలో మన దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ కొడుతున్నాయి.. చైనా కంపెనీలు ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. మన దేశ సంపదను మనకు తెలియకుండానే కొల్లగొడుతున్నాయి. చైనా లోని ఆప్స్ వ్యవహారం వెనకాల అక్కడి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నట్టుగా అధికారం విచారణలో బయటపడింది. అంతేకాకుండా దేశంలోకి వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్న రు..వస్తువులను దిగుమతి చేసుకున్న వారు చెప్పి దాని పేరు మన దేశానికి సంబంధించిన సంపదను తరలిస్తున్నారు. నకిలీ వే బిల్ సృష్టించి దాని ద్వారా డబ్బులను చైనాకు పంపించినట్టు గా వెలుగులోకి వచ్చింది. చైనా లోన్ ఆప్స్ వ్యవహారంపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు తో పాటు ఈడి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ డి దర్యాప్తు చాలా కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా నుంచి విమానాల ద్వారా పెద్ద మొత్తంలో సరుకు దిగుమతి చేసుకున్నట్లుగా ఈడి విచారణ లో బయటపడింది .
అయితే ఈ సరకు సంబంధించి విచారణ చేసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి . విమానాల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు చెప్తున్న దానిపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అంతేకాకుండా కస్టమ్స్ పేరు తో నకిలీ వే బిల్స్ సృష్టించి దాని పేరు మీద సరుకు రవాణా చేసినట్టుగా రికార్డులు చూపెట్టారు. రూపంలో డబ్బు బదిలీ కూడా చేపట్టారు. దీంట్లో సరుకు రవాణా చేసుకున్న నేపథ్యంలో 450 కోట్ల రూపాయలను చైనాకు తరలించారు. ఈ 450 కోట్ల రూపాయల సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి దిగుమతి చేసే అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు వెంటనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.
భారత్‌కు భద్రత విషయంలో ముప్పు పొంచివున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంపెనీలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి.వివిధ యాప్‌లకు యాజమాన్య సంస్థగా వేరే కంపెనీని ముందు పెట్టి తెర వెనుక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత మార్కెట్లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్నాయి. గత సంవత్సరం నిషేధానికి గురైన ఆలీబాబా, బైట్‌డ్యాన్స్ వంటి కంపెనీలే ఈ యాప్‌లను వెనుక నుంచి నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీలు తమ యాప్‌లను కొత్త సంస్థల పేర్లతో లిస్ట్ చేస్తున్నాయి. అయితే ఆయా యాప్స్ యాజమాన్యం గురించి బయటపడకుండా చైనా మూలాల గురించి తెలియకుండా జాగ్రత్తపడుతున్నాయి.
దేశీయంగా టాప్ 60 యాప్‌ల్లో 8 చైనాకి చెందినవి ఉన్నట్లుగా ఒక పరిశోధనలో తేలింది. వీటికి ప్రతి నెలా సగటున 21.1 కోట్ల మంది యూజర్లు ఉంటున్నారు. చైనా యాప్‌లను గతేడాది జూలైలో నిషేధించినప్పుడు ఇవే యాప్‌ల యూజర్ల సంఖ్య 9.6 కోట్లే. కానీ గడిచిన 13 నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 11.5 కోట్ల మేరకు పెరిగింది. నిషేధం ఉన్నా చైనా యాప్‌లు ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నాయో దీని బట్టి తెలిసిపోతోంది. చైనాతో సరిహద్దుల్లోనూ, దౌత్యపరంగాను ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గతేడాది చైనా యాప్‌లపై కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 267 చైనా యాప్‌లను నిషేధించింది.
టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, పబ్జీ, హెలో, అలీఎక్స్‌ప్రెస్, లైకీ, షేర్ఇట్, మి కమ్యూనిటీ, వుయ్‌చాట్, బైదు సెర్చి, క్యామ్‌స్కానర్, వీబో, బిగో లైవ్‌తో పాటు షావోమీ సంస్థకు చెందిన కొన్ని యాప్‌లు వీటిలో ఉన్నాయి. దేశ ప్రజలు, వారి డేటా భద్రత కారణాల రీత్యా హోం శాఖ సిఫార్సుల మేరకు వీటిపై నిషేధం విధించినట్లు కేంద్రం అప్పట్లో వెల్లడించింది. అయితే, దాదాపు అదే తరహా యాప్‌లు కొత్త అవతారంలో నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా విస్తరిస్తుండటం గమనార్హం.
ఎక్కువగా మీడియా, వినోద రంగానికి చెందినవే..
కాగా, గుట్టుచప్పుడు కాకుండా కొత్తగా పుట్టుకొస్తున్న యాప్స్‌ల్లో అధికంగా మీడియా, వినోద రంగానికి చెందినవే ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో నిషేధం వేటు పడిన టిక్‌టాక్ (యాజమాన్య సంస్థ బైట్‌డ్యాన్స్), శ్నాక్‌వీడియో (క్వాయ్‌షో) వంటి సంస్థలు ఇదే విభాగంలో హవా కొనసాగించడం గమనార్హం. ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో యూజర్లకు త్వరితగతిన చేరువ కావడానికి వీలుంటుంది కాబట్టి మీడియా, వినోద రంగాలనే చైనా కంపెనీలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగినట్లుగానే వాటిలో కొన్ని యాప్‌లు కేవలం నెలల వ్యవధిలోనే లక్షల కొద్దీ యూజర్లను నమోదు చేసుకోవడం ఈ వాదనలకు ఊతమిస్తోంది.
ఇతర కంపెనీల పేర్లతో గూగుల్ ప్లే స్టోర్‌లో..
గూగుల్ ప్లే స్టోర్‌లో పలు చైనా యాప్‌లు అసలు యాజమాన్య సంస్థ పేరుతో కాకుండా వేరే కంపెనీ పేరుతో జాబిత అయి ఉంటున్నాయి. ఫలితంగా వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సంస్థ ఆనవాళ్లు కనుగొనడం కష్టసాధ్యంగా మారుతోంది.
లింక్డ్ఇన్ వివరాల ప్రకారం..
చాలా సందర్భాల్లో నిషేధించిన యాప్‌ల ఉద్యోగులనే కొత్త యాప్‌లకు ఆయా కంపెనీలు మారుస్తున్నట్లు లింక్డ్ఇన్ డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్ యాప్ మాజీ హెడ్ .. ఈ ఏడాది జూలైలో బైట్‌డ్యాన్స్‌లో మరో విభాగానికి మారినట్లుగా లింక్డ్ఇన్ వివరాలు చూపడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరోవైపు, భద్రత ఏజెన్సీలు ఏవైనా హెచ్చరికలు, సిఫార్సులు చేసిన తర్వాతే ఆయా యాప్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది కూడా దేశభద్రత కారణాలతో హోం శాఖ సిఫార్సుల మేరకే కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పలు యాప్‌ల నిషేధానికి ఆదేశాలిచ్చింది.
రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.106.93 కోట్లు ఈడీ జప్తు చేసింది. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చిన పీసీఎఫ్ఎస్..చైనాకు చెందిన జో యాహుయ్ ఆధీనంలో పనిచేస్తోందని ఈడీ అధికారులు వెల్లడించారు. బోగస్ సాఫ్ట్వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌కు నిధులు తరలించినట్టు ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్ము జప్తు చేసినట్టు కూడా ఈడీ అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో పలువురు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన లోన్ యాప్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది.
ప్రజల్ని మోసగించడం, భారీగా డబ్బులు దండుకోవడం, ఆ మొత్తాన్ని అక్రమ మార్గాల్లో చైనా సహా ఇతర దేశాలకు తరలించడంలో.. ఆన్లైన్ బెట్టింగ్స్కామ్, లోన్ యాప్స్ కు సంబంధాలున్నాయన్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన ఫిర్యాదులపై ఈడీ వేగం పెంచింది. చైనీస్ లింకులకు సంబంధించి ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొబైల్ లింకులపై కూపీ లాగుతున్నారు పోలీసులు. గతంలోనే గూగుల్ సంస్థకు లేఖ రాశారు. గూగుల్ ప్లే స్టోర్స్‌లో వున్న 158 ఆన్లైన్ లోన్ యాప్స్‌ని తొలగించాలని తెలంగాణ పోలీసులు గూగుల్‌ను తమ లేఖ ద్వారా కోరారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా బాధితులను టెలికాలర్లు వేధింపులకు గురి చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందికి పైగా అరెస్టు చేశారు. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ మొబైల్ యాప్‌ల వెనుక చైనా హస్తముందన్న కథనాల నిగ్గు తేలనున్నది.
— Ramesh Vaitla