Russia: రష్యా-భారతదేశం-చైనా (RIC) ఫార్మాట్‌లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది భారత్ పర్యటనకు రాబోతున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి పుతిన్ భారత్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
Russia: న్యూఢిల్లీ నిర్వహించిన జీ20 సమావేశం ‘మైలురాయి’గా మిగిలిపోతుందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ అభివర్ణించారు. G20 అధ్యక్షుడిగా భారతదేశం తొలిసారిగా గ్లోబల్ సౌత్ స్థానాన్ని ఏకీకృతం చేసిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎజెండా కాకుండా భారత్ వ్యవహరించిందని చెప్పారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణపై ఆయన స్పందించారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఉక్రెయన్-రష్యా యుద్ధంలో అమెరికా లబ్ధి పొందేందుకు చూస్తోందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక, సైనిక-వ్యూహాత్మక పరంగా దీన్ని నుంచి ప్రయోజనాలు పొందాలని చూస్తోంది తెలిపారు. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని నియంత్రిస్తుందన్నారు. రష్యా యుద్ధభూమిలో ఉందని.. విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.