WHO: కూల్ డ్రింక్స్‌లో కేన్సర్ కారకం.. WHO కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WHO: కేన్సర్ కారకాలు మనం తినే ఆహార పదార్థాల్లో ఉంటాయని తెలిసిందే. ఎటువంటి పదార్థంలో ఎంత మేరకు ఉంటుందో తెలుసుకోవల్సి ఉంటుంది. ఎక్కువ మోతాదులో కేన్సర్ కారకం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రస్తుత జీవన శైలిలో ప్రతి ఒక్కరూ కూల్‌డ్రింక్స్ ను ఇష్టపడతారు. కూల్ డ్రింక్స్ ను రోజూ తాగే వారు ఉంటారు. ఇకపై కూల్ డ్రింక్స్ తాగే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని అనుకుంటున్నారా? కూల్ డ్రింక్స్‌లో కూడా కేన్సర్ కారకాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. అదెలా అంటే..
Read also: Diamonds: సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం.. భారీగా తరలివస్తున్న జనం
Also Read
- China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
శీతల పానీయాలలో సాధారణంగా ఉపయోగించే కృత్రిమ చక్కెర అస్పార్టేమ్‌ను కేన్సర్ (Cancer) కారకంగా వర్గీకరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం వెల్లడించింది. రోజువారీ తీసుకునే ఆమోదయోగ్యమైన పరిమితి స్థాయిలో మార్పు ఉండదని పేర్కొంది. అయితే ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని సంస్థలకు గాపీ. పూర్తిగా వినియోగించొద్దని వినియోగదారులకు గానీ తాము సలహా ఇవ్వడం లేదని తెలిపింది. కేవలం అవగాహన కోసమే సూచనలు ఇస్తున్నామని స్పష్టం చేసింది. ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని కంపెనీలకు సలహా ఇవ్వడం లేదని.. పూర్తిగా వినియోగించడం మానేయమని ప్రజలకు సలహా ఇవ్వడం లేదు.. కేవలం అవగాహన కోసమే సలహా ఇస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ పోషకాహార, ఆహార భద్రత డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బ్రాంకా అన్నారు. కేన్సర్ వచ్చేందుకు ఆస్కారం ఉన్న ఇతర పదార్థాల్లో అలొవెరా (కలబంద), డీజిల్, ఆసియా దేశాల్లో ఎక్కువగా వాడే కూరగాయలతో చేసిన ఊరగాయలు ఉన్నాయి.
Read also: Bro: తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్… ‘జానవులే’ కోసం ఫాన్స్ వెయిటింగ్
డబ్ల్యూహెచ్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (IARC) జూన్ 6 నుంచి 13 వరకు ఫ్రాన్స్‌లోని లియోన్‌లో జరిగిన సమావేశంలో అస్పార్టేమ్ కేన్సర్ కారకమని మొట్టమొదటిసారిగా అంచనా వేసింది. అస్పార్టేమ్ కారణంగా మానవుల్లో కేన్సర్ వచ్చే అవకాశం ఉందని ఐఏఆర్సీ బృందం వర్గీకరించినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మనుషుల్లో కేన్సర్‌కు కారణమయ్యే అవకాశాలు ఉన్న గ్రూప్ 2బీలో అస్పార్టేమ్‌ను చేర్చింది. ప్రత్యేకంగా హెపాటోసెల్లర్ కార్సినోమాకు సంబంధించి (ఒక రకమైన కాలేయ కేన్సర్) అందుబాటులో ఉన్న పరిమిత సాక్ష్యాల ఆధారంగా దీనిని ఈ వర్గంలో చేర్చింది. జంతువులలో కేన్సర్‌కు సంబంధించి ప్రయోగాత్మకంగా పరిమిత ఆధారాలు ఉన్నాయి. టీ, కాఫీలలో ఉండే కెఫిక్ యాసిడ్, అలోవేరా గ్రూప్ 2బి కేటగిరీలో ఉందని లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ కేన్సర్ ఎపిడిమియాలజీ ప్రొఫెసర్ పాల్ ఫారోహ్ చెప్పారు. గ్రూప్ 2బిగా వర్గీకరించిన రసాయనంతో సంబంధం ఉన్న కేన్సర్ ప్రమాదం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అస్పార్టేమ్ అనేది 1980ల నుంచి వివిధ ఆహార, పానీయాల ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగించే ఒక కృత్రిమ రసాయన స్వీటెనర్. ఇది డైట్ డ్రింక్స్, చూయింగ్ గమ్, జెలటిన్, ఐస్ క్రీం, పెరుగు వంటి పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, టూత్‌పేస్ట్, దగ్గు, చుక్కల మందులో దీనిని వినియోగిస్తారు. గ్రూప్ 2బి వర్గీకరణ అస్పార్టేను అలోవేరా, ఇతర కూరగాయల మాదిరిగానే ఉంచుతుందని ఇంటర్నేషనల్ స్వీటెనర్స్ అసోసియేషన్ తెలిపింది.
తాజావార్తలు
-
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్‌తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!