నిన్నామొన్నటిదాకా ట్రంప్ కారాలు.. మిరియాలు నూరారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారో ఆ వ్యక్తికే ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు వైట్‌హౌస్ వేదికైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Eric Trump: ఇటీవల న్యూయార్క్ మేయర్‌గా భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. మమ్దానీపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జోహ్రాన్ మమ్దానీ ‘‘భారతీయులను ద్వేషిస్తాడు’’ అని ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
BJP Leader: అమెరికా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు కాబోతున్న మొదటి ముస్లిం మేయర్‌గా మమ్దానీ చరిత్ర సృష్టించారు. దీని తర్వాత, ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము ఏ ఖాన్‌ను ముంబై మేయర్‌గా అనుమతించం’’ అని అన్నారు. ఓట్ జిహాద్ ద్వారా న్యూ్యార్క్ నగరంలో కనిపించే విధంగా ముంబైకి రాజకీయాలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఊహించని రీతిలో తొలి సారి ముస్లిం వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయాన్ని అందుకున్నారు. ఓ వైపు మమ్దానీకి ఎవరూ ఓట్లు వేయొద్దని అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చినా.. ఏ మాత్రం ఖాతర్ చేయకుండా ఓటర్లు కసితో మమ్దానీకి గుద్దేశారు. రిపబ్లికన్ అభ్యర్థిపై మమ్దానీ భారీ విజయంతో గెలుపొందారు.
ట్రంప్‌కు అమెరికన్లు గట్టి షాకిచ్చారు. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలోనే ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అగ్ర రాజ్యం అమెరికాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అన్ని చోట్ల డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోయారు. రిపబ్లికన్ పార్టీ చతికిలపడింది.
న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దానీని ఎన్నికయ్యారు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా ఎలా ఎంపిక చేస్తారంటూ డెమొక్రాటిక్ పార్టీపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ పదవికి ముందు వరసలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నగర మేయర్‌గా ఎన్నికైతే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను నగరంలోకి ప్రవేశిస్తే, అరెస్ట్ చేయాలని న్యూయార్క్ పోలీస్ శాఖను ఆదేశిస్తానని అన్నారు. ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని నేను నేరవేర్చాలనుకుంటున్నానని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్.. మమ్దానీపై తీవ్రంగా స్పందించారు. తాజాగా మమ్దానీ రియాక్ట్ అయ్యారు. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత ముస్లిం సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు.
Zohran Mamdani: భారతీయ అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్ కుమారుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ ప్రైమరీలో విజయం సాధించి వార్తల్లో నిలిచాడు. 33 ఏళ్ల వయసు ఉన్న ఈ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధిస్తే, అమెరికాలో అతిపెద్ద నగరానికి తొలి ముస్లిం మేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. అయితే, గతంలో మమ్దానీ భారత్, భారత ప్రధాని నరేంద్రమోడీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారతీయులతో పాటు చాలా మంది అతడి…