ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జూలై నెల విషయానికి వస్తే
జూలై 5: టైటానిక్, అవతార్, అవతార్ : ద వే ఆఫ్ వాటర్ చిత్రాల నిర్మాత జాన్ లాండౌ (63) కాన్సర్ తో కన్నుమూత
జూలై 5: రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ లో కేసు
జూలై 6: లావణ్య పై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపికి ఫిర్యాదు
జూలై 6: టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్వప్న వర్మ ఆత్మహత్య
జూలై 9: బాలకృష్ణ – బాబి సినిమా షూట్ లో నటి ఊర్వశి రౌతేలాకి గాయం
జూలై 10: యూట్యూబర్, నటుడు ప్రణీత్ హన్మంతు బెంగళూరులో అరెస్ట్
జూలై 10: థాయ్ లాండ్ లో ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ – నికోలాయ్ సచ్దేవ్ పెళ్లి
జూలై 15: డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు అరెస్ట్
జూలై 17: నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయినట్టు ప్రకటన
జూలై 17: కార్తీ ‘సర్దార్ -2’ షూటింగ్ లో ఫైట్ ట్రైనర్ మృతి
జూలై 28: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగగా శశి భూషణ్ ని అధ్యక్షుడిగా, అశోక్ కుమార్ ను ఉపాధ్యక్షుడిగా నాలుగు సెక్టార్లకు చెందిన కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు.
జూలై 28: తమిళ రాకర్స్ వెబ్ సైట్ అడ్మిన్ స్టీఫెన్ రాజా తిరువనంతపురంలోని థియేటర్ లో అరెస్ట్
జూలై 29: పాత చిత్రాల షూటింగ్ పూర్తి చేయకుండా ధనుష్ కొత్త చిత్రాలలో నటించకూడదంటూ నిర్మాతల మండలి అల్టిమేటమ్ జారీ