Boris Johnson: ప్రధాని ఎవరైనా మంచిదే.. కానీ రిషి సునక్ మాత్రం వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ ప్రధాని రేసులో అందరి కన్నా ముందు వరసలో ఉన్నారు భారత సంతతి వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్. ప్రధాని పదవీ రేసులో ఇప్పటికే రెండు రౌండ్లను దాటేశాడు. నెమ్మనెమ్మదిగా ప్రధాన మంత్రి పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ అయ్యేందుకు దగ్గరవుతున్నాడు. అన్నీ అనుకూలిస్తే బ్రిటన్ దేశాన్ని భారత సంతతి వ్యక్తి పాలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం రిషి సునక్ తర్వాతి స్థానల్లోనే ఇతర అభ్యర్థులు ఉన్నారు. అవినీతి ఆరోపణలతో ఇటీవల ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం కేర్ టేకర్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధాని రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
ఇదిలా ఉంటే ప్రధాని బోరిస్ జాన్సన్ తన వారసుడి కోసం జరుగుతున్న ఎన్నికల్లో రిషి సునక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రధానిగా రిషి సునక్ కు తప్పా మరెవరికైనా మద్దతు ఇవ్వాలని ఎంపీలకు చెబుతున్నట్లు శుక్రవారం బ్రిటిష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రధాని ఎవరైనా మంచిదే కానీ.. రిషి మాత్రం కాకూడదనే గట్టి పట్టుదలతో బోరిస్ జాన్సన్ తన వర్గం ఎంపీలకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీలో బహిరంగంగా జోక్యం చేసుకోనని గతంలో బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించాడు. అయితే అంతర్గతంగా మాత్రం రిషి సునక్ ప్రధాకి కాకుండా ఎత్తుగడలు వేస్తున్నాడు.
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
Reas Also: Fuel Price Cut: అక్కడ పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.7 తగ్గింపు..
ప్రస్తుతం యూకే ప్రధాని రేసులో రిషి సునక్ తో పాటు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, మాజీ మంత్రి కెమి బాడెనోచ్, టోరీ బ్యాక్‌బెంచర్ టామ్ తుగేన్‌ధాట్ ఉన్నారు. ఈ వారం వీరంతా టీవీ చర్చలో పాల్గొననున్నారు. రిషి సునక్ కు బదులు పెన్నీ మోర్డాంట్ కు మద్దతు ఇవ్వాలని బోరిస్ జాన్సన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిషి సునక్ తనకు ద్రోహం చేశారనే ఆగ్రహంలో బోరిస్ జాన్సన్ ఉన్నాడని తెలుస్తోంది. తను రాజీనామా చేయడంలో రిషి సునక్ కీలక పాత్ర పోషించాడని.. మంత్రులను దూరం చేశాడని బోరిస్ జాన్సన్ కోపంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కారణంగానే రిషి సునక్ తప్పా ఎవరు ప్రధాని అయినా ఓకే అని బోరిస్ జాన్సన్ ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!