Imports Ban: ఆ వస్తువుల దిగుమతులపై బ్యాన్.. అసలు కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imports Ban: కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే (ఆగస్టు 3వ తేదీ నుంచే) అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా.. స్థానిక తయారీని ప్రోత్సాహించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది ఒకటి. ఒకవేళ.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్ తదితర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెక్ట్స్‌ని దిగుమతి చేసుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Read also: Air India Express: విమానాన్ని వెనక్కి రప్పించిన ఉల్లి ఘాటు..
Also Read
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వం చాలా రంగాల్లో దేశీయ తయారీని ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద.. వివిధ రంగాల్లో స్థానికంగా తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్న వారికి కేంద్రం భారీఎత్తున ప్రోత్సాహకాల్ని అందిస్తోంది. అయినప్పటికీ.. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి చౌకగా దిగుమతులు జరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో పోల్చుకుంటే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంప్యూటర్స్, ల్యాప్‌టాబ్స్, ట్యాబ్లెట్ల దిగుమతులు 6.3 శాతం పెరిగి.. 19.9 బిలియన్ డాలర్లకు (ఇండియన్ కరెన్సీలో రూ.1.6 లక్షల కోట్లు) చేరుకున్నాయి. ఫలితంగా.. దేశీయ తయారీపై గట్టి ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే.. దేశీయ తయారీని ప్రోత్సాహించడంలో భాగంగా ఆ మూడింటిపై కేంద్రం ఆంక్షలు విధించింది.
భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ సెక్టర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ ఆంక్షల కారణంగా, ఆ మూడు పరికరాల దిగుమతికి సంబంధించిన ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు బావిస్తున్నారు. అంతేకాదు.. ఈ నిర్ణయం డెల్, ఏసర్, సామ్‌సంగ్, పానసొనిక్, యాపిల్, లెనోవో, హెచ్‌పీ వంటి సంస్థలకు పెద్ద సవాలుగా మారనుంది. ఈ సంస్థలన్నీ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. తాజా ఆంక్షల కారణంగా.. ఈ కంపెనీలు ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ యూనిట్లను భారత్‌లోనే నెలకొల్పి, సమర్థవంతంగా పని చేసే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?