US-Israel: ఖతార్‌లో దాడి విషయం అమెరికాకు ముందే తెలుసా! వెలుగులోకి కీలక రిపోర్ట్!
- ఖతార్‌లో దాడి విషయం అమెరికాకు ముందే తెలుసా!
- వెలుగులోకి కీలక రిపోర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖతార్‌లో హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం మెరుపు వేగంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడింది. దోహాలో నివాస సముదాయాల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే హమాస్ అగ్ర నాయకులంతా తప్పించుకోగా.. బంధువులు, ఒక ఖతార్ అధికారి మాత్రం బలైపోయారు. అయితే ఈ దాడి అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును ఖండించాయి. ఖతార్‌కు మద్దతుగా నిలిచాయి.

Also Read
- India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
- Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
ఇక ఇదే విషయంపై ట్రంప్ స్పందిస్తూ ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి విషయం తనకు తెలియదని.. దీని వెనుక తన ఆదేశాలు లేవని.. పూర్తిగా నెతన్యాహు ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు. ఖతార్ తమ మిత్ర దేశమని.. ఇకపై ఏ దాడి జరగబోదని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను అందుకే చంపేశా.. నిందితుడు కీలక వ్యాఖ్యలు
అయితే అమెరికా వాదనను ఒక జర్నలిస్ట్ తోసిపుచ్చారు. ఖతార్‌లోని దోహా దాడి గురించి అమెరికాకు ముందే తెలుసని వాదించారు. ఖతార్‌లోని హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి గంట ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ట్రంప్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని.. కనీసం ముగ్గురు సీనియర్ ఇజ్రాయెల్ అధికారులు ఈ విషయం తనతో చెప్పారని ఆక్సియోస్ రిపోర్టర్ బరాక్ రవిద్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Madyapradesh: చెల్లి మరిదితో అక్క ప్రేమాయణం.. తర్వాత ఏమైందంటే…
క్షిపణులు గాల్లోకి ఎగిరిన తర్వాత కాదు.. గాల్లోకి ఎగరక ముందే.. అనగా ఉదయం 8 గంటల ప్రాంతంలో ట్రంప్‌కు సమాచారం అందించినట్లుగా ముగ్గురు ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు తనతో చెప్పారని పేర్కొన్నాడు. వాస్తవంగా ఉదయం 7:45 గంటలకే ట్రంప్‌కు నెతన్యాహు నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని వివరించాడు. అయితే తనతో నాల్గో అధికారి కూడా తనతో మాట్లాడాడని.. ఈ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించినట్లు పేర్కొ్న్నాడు. ఉదయం 7:45కే ట్రంప్‌కు కాల్ వెళ్లిందని ఆయన చెప్పినట్లుగా వివరించాడు.
ఇటీవల ట్రంప్‌ను ఇదే విషయాన్ని విలేకరి మరోసారి ప్రశ్నించగా దాడి గురించి ముందు చెప్పలేదని.. దాడి తర్వాత చెప్పరని చెప్పుకొచ్చారు. దీంతో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. విషయం చెప్పే సమయానికే క్షిపణులు గాల్లోకి ఎగిరిపోయాయని.. ఆ తర్వాతే వైట్‌హౌస్‌కు సమాచారం వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం రిపోర్టర్ చెప్పేదానికి-ట్రంప్ చెప్పేదానికి ఏ మాత్రం పొంతన లేదు.
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!