Viral Video: ఒడిశాలో భయానక ఘటన చోటుచేసుకుంది. జాజ్‌పూర్ జిల్లాలో ఓ మహిళను మొసలి నదిలోకి ఈడ్చుకెళ్తున్న సంఘటన స్థానికంగా ప్రజల్లో భయాందోళల్ని నింపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధిత మహిళను 57 ఏళ్ల సౌదామిని మహాలగా గుర్తించారు.
Crocodile Attack: కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. బీహార్ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలుడిని ఓ మొసలి చంపి తినేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని నది నుంచి ఈడ్చుకొచ్చి కసితీరా కర్రలు, రాడ్లతో కొట్టి చంపారు. కొత్త బైక్ కొన్నామనే ఆనందం ఆ కుటుంబంలో ఎంతో సేపు నిలవలేదు. కొత్త బండికి పూజలు చేసేందుకు గంగా నదిలో స్నానం చేసి, గంగా జలాన్ని తీసుకురావాలనుకున్న బాలుడిపై మొసలి దాడి చేసి చంపేసింది.
Crocodile Attack: ఆస్ట్రేలియా దేశంలో మొసళ్లు, షార్క్ దాడులు తరుచుగా జరుగుతున్నాయి. వీటి బారిన పడిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ రిసార్ట్ లో ఓ వ్యక్తి స్నార్కెలింగ్(ఆక్సిజన్ మాస్క్ తో ఈతకొడుతుండగా) చేస్తుండగా హఠాత్తుగా మొసలి దాడి చేసింది.