Wolf 1069 b: భూమికి అత్యంత సమీపంలో భూమిలాంటి గ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf 1069 b: సౌరవ్యవస్థకు వెలుపల భూమిలాంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా..? అనే అణ్వేషన దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. ఎక్లోప్లానెట్ కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు భూమితో పోలికలు ఉన్న గ్రహాలను పదుల్లో కనుక్కున్నప్పటికీ పూర్తిగా అవి భూమి తరహా వాతావరణాన్ని కలిగి లేవు. ఈ గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయా..? అనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
Read Also: Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నరేంద్రమోదీ..
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
ఇదిలా ఉంటే తాజాగా భూమికి అత్యంత సమీపంలో అంటే కేవలం 31 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి గ్రహాన్ని కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. వోల్ఫ్ 1069బిగా పిలిచే ఈ గ్రహం తన మాతృ నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సరంలో ఎంతదూరం ప్రయాణిస్తుందో దాన్ని ‘ కాంతి సంవత్సరం’ పిలుస్తుంటాం. ఖగోళ దూరాలతో పోలిస్తే 31 కాంతి సంవత్సరాలు అనేది చాలా తక్కువ దూరం అనే చెప్పవచ్చు. భూమి ద్రవ్యరాశి కలిగిన ఈ గ్రహాన్ని ఎంపీఐఏ శాస్త్రవేత్త డయానా కొస్సాకోవ్స్కీ నేతృత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం కనుగొంది.
వోల్ఫ్ 1069 బి అని పిలువబడే ఈ గ్రహం తన మాతృ నక్షత్రం చుట్టూ టైడల్ లాక్ పొజిషనల్ లో తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని పగటి పూట నివాసయోగ్యమైన పరిస్థితులు ఉండవచ్చని అంచానా వేస్తున్నారు. జీవావరణం, నివాసయోగ్యంగా ఉందా అనే సంకేతాలను వెతుకుతున్నారు. దాదాపుగా భూమి ద్రవ్యరాశిని కలిగిన ఈ గ్రహం, కేవలం 15.6 రోజుల్లోనే నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. భూమి, సూర్యుడి మధ్య దూరంతో పోలిస్తే కేవలం 15వ వంతు దూరంలోనే ఉంది. భూమి, సూర్యుడి నుంచి పొందే కాంతిలో కేవలం 65 శాతం పొందుతోందని.. వోల్ఫ్ 1069 నక్షత్రం తక్కువ రేడియేషన్ విడుదల చేస్తోందని దీంతో నారింజ కలర్ లో కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వోల్ఫ్ 1069 బీ, తక్కువ శక్తి కలిగిన మరగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతుండటం దానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. హాబిటేబుల్ జోన్ లోనే ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Diabetes: షుగర్ కంట్రోల్‌కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!