Satvika Veeravalli: రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, అమెరికా జాబ్ వదిలేసి హీరోయిన్గా వచ్చా: సాత్విక వీరవల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satvika Veeravalli: సాధారణంగా అమెరికాలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, చేతిలో రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు ఉంటే ఎవరైనా జీవితంలో సెటిల్ అయిపోయామని భావిస్తారు. కానీ సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆ భద్రత ఉన్న జీవితాన్ని కూడా వదులుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో వస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సాత్విక తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
అమెరికాలో ఎంతో పేరున్న ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని ఇండియాకు వచ్చిన రోజును సాత్విక వేదికపై గుర్తుచేసుకున్నారు. “ఒరాకిల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజు నాకు ఒక్కసారిగా భయం వేసింది. నాలుగు ఏళ్ల వృత్తిపరమైన అనుభవం, రెండు ఇంజినీరింగ్ డిగ్రీలను దేనికోసం వదిలేస్తున్నాను? నా నిర్ణయం తప్పైతే ఏంటి? అని ఆ రోజు చాలా ఆందోళన చెందాను” అని సాత్విక తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే, ‘ఆకాశంలో ఒక తార’ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత తన భయాలన్నీ పోయాయని ఆమె చెప్పారు. బాక్సాఫీస్ లెక్కలు, నంబర్ల కంటే.. వందలాది మంది ప్రేమ, కష్టంతో నిర్మించిన ఈ అందమైన సినిమాలో తాను భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒక్కరోజు కూడా తనకు ఇంటికి దూరంగా ఉన్నాననే ఫీలింగ్ రాకుండా చిత్ర బృందం ఎంతో ఆప్యాయంగా చూసుకుందని కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Aakasamlo Oka Tara: 'రేసుగుర్రం' షూటింగ్ టైంలో బన్నీ అన్న చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను: పవన్ సాధినేని
- Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
- G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. 'లక్కీ భాస్కర్' తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
- Ramya Krishna: 'నీలాంబరి' వద్దనుకున్నా.. 'బాహుబలి'కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
ఏ నటికైనా కలల లాంటి అరంగేట్రం తనకు దక్కిందని సాత్విక సంతోషం వ్యక్తం చేశారు. తనపై ఇంత పెద్ద నమ్మకం ఉంచిన నిర్మాతలు అల్లు అరవింద్, స్వప్న దత్, ప్రియాంక దత్, సందీప్, రమ్య, విద్య గార్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా స్టోరీ డిస్కషన్స్ నుంచి షూటింగ్ లాస్ట్ డే వరకు తనకోసం ఎంతో పోరాడిన దర్శకుడు పవన్ సాధినేనికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ సాత్విక మురిసిపోయారు. తాను ఎన్నో ఏళ్లుగా అల్లు అర్జున్ యాక్టింగ్‌కి, ముఖ్యంగా ఆయన అద్భుతమైన డ్యాన్స్‌కు వీరాభిమానినని, ఆయన ఈ వేడుకకు రావడం తమ అదృష్టమని అన్నారు. అలాగే ఈ ఈవెంట్‌కు రాలేకపోయిన నటి శృతి హాసన్‌ను ‘పవర్ హౌస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్’ అని కొనియాడిన సాత్విక, ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. తనతో పాటు నటించిన రోహిణి, శ్వాసిక, చైతు తదితర నటీనటులకు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మొదలైన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Satvika Veeravalli: రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, అమెరికా జాబ్ వదిలేసి హీరోయిన్గా వచ్చా: సాత్విక వీరవల్లి
-
Aakasamlo Oka Tara: ‘రేసుగుర్రం’ షూటింగ్ టైంలో బన్నీ అన్న చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను: పవన్ సాధినేని
-
Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
-
BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!
-
G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!