USA: అమెరికా ఉన్నంత కాలం మీరు ఒంటరి కాదు..ఇజ్రాయిల్‌కి అగ్రరాజ్యం మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: ఇజ్రాయిల్‌కి అగ్రరాజ్యం అమెరికా పూర్తి మద్దతును ప్రకటించింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ దేశానికి సంపూర్ణ సహకారం అందిస్తోంది. తాజాగా గురువారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయిల్ వెళ్లారు. ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ‘అమెరికా ఉన్నంత కాలం మీరు ఒంటరి కారని, మీరు ఒంటరిగా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవసరం ఉండదని’ యూఎస్ మద్దతును తెలియజేశారు. అయితే పాలస్తీనియన్ల చట్టబద్ధ అకాంక్షలు కూడా ఉన్నాయని అన్నారు.
Read Also: D K Shivakumar: బీజేపీ, జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో 40 మంది.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
Also Read
- China: "మనం శత్రువులం కాము".. భారత్‌కు చైనా సందేశం..
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారత్ విజ్ఞప్తి
- Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1200 మంది సాధారణ ప్రజలను హతమార్చారు. 150 మంది వరకు బందీలుగా పట్టుకున్నారు. శాంతిని, న్యాయాన్ని కోరుకునే ఎవరైనా హమాస్ ఉగ్రవాద దాడిని ఖండిచాలని, హమాస్ ఉగ్రవాదులు పాలస్తీనియన్ల భద్రత, స్వేచ్ఛకు, గౌరవంగా జీవించాలనే వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించదని ఆంటోని బ్లింకెన్ అన్నారు.
నేను అమెరికా ప్రతినిధిగానే కాకుండా ఓ యూదుడిగా మీ ముందుకు వచ్చానని బ్లింకెన్ అన్నారు. నేను కూడా చిన్న పిల్లల తండ్రిగా, భర్తగా మీ ముందుకు వచ్చానని, కిబ్బట్జ్ నీర్ ఓజ్ లో ఇంటిలో ఉన్న తల్లిదండ్రుల్ని, ముగ్గురి పిల్లల్ని హత్య చేసిన ఫోటోలు చూడటం కష్టంగా ఉందని అన్నారు. ఇజ్రాయిల్ సైనిక అసవరాలను తీర్చడానికి అమెరికా, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని బ్లింకెన్ మద్దతు ఇచ్చాడు. ఐసిస్ అణిచివేసినట్లు హమాస్ కూడా అణిచివేయబడుతుందని నెతన్యాహు అన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!