Israel-Hamas War: వాహనాలే శవాగారాలు.. ఐస్ క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు.. గాజాలో దయనీయ పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: హమాస్ చేసిన తప్పులకు గాజా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దొరికినవారిని దొరికినట్లు దారుణంగా చంపేశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు తెగబడంతో పాటు అభంశుభం తెలియని చిన్నారులను తలలు నరికి చంపారు. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ వైపు 1300 మంది ప్రజలు మరణించారు. ఈ దాడితో తీవ్ర ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయిల్ రగిలిపోతోంది. గాజాపై నిప్పుల వర్షం కురిపిస్తోంది.
ఇజ్రాయిల్ వైమానిక దాడుల వల్ల గాజా స్ట్రిప్ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. హమాస్ స్థావరాలపై భీకరదాడులు చేస్తోంది. హమాస్ కార్యకర్తలు ఉన్నారన్న అనుమానం ఉన్న ప్రతీ భవనాన్ని లేపేస్తోంది. భారీ దాడులతో గాజా ప్రాంతంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ 2300 మందికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
Read Also: Justin Trudeau: భారత్‌తో దౌత్య వివాదాల మధ్య కెనడా ప్రధాని ‘నవరాత్రి శుభాకాంక్షలు’
అంతంత మాత్రం ఆరోగ్య సదుపాయలు ఉన్న గాజా ప్రాంతంలో పరిస్థితులు దిగజారుతున్నాయి. మృతదేహాలను పెట్టేందుకు ఆస్పత్రిలో స్థలం లేకపోవడంతో ఐస్ క్రీమ్ తరలించే ట్రక్కుల్లో మృతదేహాలను నిల్వ చేస్తున్నారు. ఐస్ క్రీం కంపెనీల నుంచి ఐస్ క్రీం ఫ్రీజర్లను తీసుకుని వచ్చామని, ఆస్పత్రి మార్చురీలో కేవలం 10 మృతదేహాలను మాత్రమే పెట్టగలిగే సామర్థ్యం ఉందని డీర్అల్ లోని షుహదా అల్-అక్సా ఆస్పత్రికి చెందిన డాక్టర్ యాసర్ అలీ చెప్పారు. ఇలాగే యుద్ధం కొనసాగితే శ్మశానాలు కూడా సరిపోవని, ఇప్పటికే అవన్నీ నిండిపోయాయని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.
సూపర్ మార్కెట్లకు ఐస్ క్రీమ్‌లను సరఫరా చేసే ట్రక్కుల్లో మృతదేహాలను తాత్కాలికంగా భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాలే గాజాలో శవాగారాలుగా మారాయి. అయితే లెక్కకు మించి మృతదేహాలు వస్తుండటంతో ఈ టక్కులు కూడా సరిపోవడం లేదు. ఒక్కో ట్రక్కులో 20-30 మృతదేహాలను పెడుతున్నారు.
ఎనిమిది రోజుల క్రితం ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య యుద్ధం మొదలైంది. గాజాలో 2300 మంది మరణిస్తే వీరిలో నాలుగింట ఒకవంతు పిల్లుల ఉన్నారు.
మరోవైపు ఇజ్రాయిల్ ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. దక్షిణంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. గాజా స్ట్రిప్ ని దిగ్భందించిన ఇజ్రాయిల్ తాగునీరు, కరెంట్, ఇంధనాన్ని కట్ చేసింది. ఇప్పటి వరకు వైమానిక దాడులకే పరిమితమైన ఇజ్రాయిల్ ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!