Donald Trump: ట్రంప్ ఇంట్లోకి ఆగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ..
- ట్రంప్ ఫ్లోరిడా రిసార్ట్‌లోకి అగంతకుడు..
- మార్ ఏ లాగో లోకి ప్రవేశించేందుకు యత్నించిన సాయుధ వ్యక్తి..
- కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్ లోకి అనధికారికంగా ప్రవేశించిన చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. మార్ ఎ లాగో ఎస్టేట్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించిన ఒక సాయుధ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హతమార్చారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ట్రంప్ అక్కడ లేరు.
ఈ విషయాన్ని యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారి గుగ్లియెల్మీ ఎక్స్ పోస్టులో ధ్రువీకరించారు. ‘‘ఈ ఉదయం మార్ ఎ లాగో వద్ద సురక్షిత సరిహద్దుల్లోకి ప్రవేశించిన సాయుధ వ్యక్తిని కాల్చి చంపాము’’ అని పేర్కొన్నారు. దుండగుడి వద్ద ఒక తుపాకీ, ఫ్యూయల్ క్యాన్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటన ఈరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు జరిగిందని, మరణించిన వ్యక్తికి 20 ఏళ్లు ఉన్నట్లుగా వెల్లడించారు.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
Read Also: Akhilesh Yadav: ‘‘100 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మీరే సీఎం అవ్వండి’’.. అఖిలేష్ బంపర్ ఆఫర్..
ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్ వాషింగ్టన్ లో ఉన్నారు. పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ డిప్యూటీ, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దుండగుడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ముందుగా దుండగుడిని అతడి వద్ద ఉన్న వస్తువుల్ని కింద పారేయాలని భద్రతా సిబ్బంది హెచ్చరించింది, అయితే అతను గన్ మీదకు ఎత్తడంతో కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
మార్ ఎ లాగో అనేది ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ ప్రాపర్టీ. దీనిని 1920లలో సముద్ర తీరంలో నిర్మించారు. 1985లో ఈ ప్రాపర్టీని ట్రంప్ కొనుగోలు చేశారు. దీనిని తరుచుగా ‘‘వింటర్ వైట్‌హౌజ్’’ అని పిలుస్తారు. ఇది రాజకీయ సమావేశాలకు, నిధుల సేకరణ, దౌత్య అతిథులకు వేదికగా నిలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ విడిది ఇల్లుగా పనిచేస్తోంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!