iQOO 15 Ultra: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గేమింగ్‌పై ప్రత్యేక దృష్టితో దూసుకెళ్తున్న ఐక్వూ (iQOO) సంస్థ తన మొదటి అల్ట్రా (Ultra) సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఐక్వూ 15 అల్ట్రా (iQOO 15 Ultra)ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత రెండు సంవత్సరాలుగా ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో ప్రో మోడళ్లను ప్రవేశపెట్టని ఐక్వూ, 2024లో iQOO 13ను, 2025లో iQOO 15ను మాత్రమే విడుదల చేసింది. ఇప్పుడు తొలిసారిగా ‘అల్ట్రా’ బ్రాండింగ్‌తో కొత్త మోడల్‌ను తీసుకురావడం విశేషం.
Car Loan Planning: కార్ లోన్‌కు ప్లాన్ చేస్తున్నారా? మీ ప్రయాణం బాగుండాలంటే వీటిపై ఒక లుక్ వేయండి..
ఈ ఫోన్‌ను చైనాలో స్ప్రింగ్ ఫెస్టివల్‌కు ముందు విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. చైనీస్ న్యూ ఇయర్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుండగా.. ప్రముఖ లీకర్ డిజిటల్ చాట్ స్టేషన్ సమాచారం ప్రకారం ఐక్వూ 15 అల్ట్రా ఫిబ్రవరి ప్రారంభంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. iQOO 15 అల్ట్రాను ఒక “ప్రొడక్టివిటీ టూల్”గా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ప్రధానంగా గేమ్ స్ట్రీమర్లు, ఈ-స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్ కావచ్చని అంచనా. అందువల్ల ఇది ఒప్పో, వివో, షియోమీ వంటి బ్రాండ్ల అల్ట్రా మోడళ్లలా కెమెరా ఫోకస్ కాకుండా.. పూర్తిగా గేమింగ్ పనితీరుపై ఆధారితమైన అల్ట్రా ఫోన్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trivikram-Sunil : ఒకే రోజున పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్-సునీల్
వీటితోపాటు.. ఈ ఫోన్‌లో అప్‌గ్రేడ్ చేసిన యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, షోల్డర్ బటన్లు, అలాగే పూర్తిగా కొత్త ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉండనున్నాయి. పరిశ్రమలోనే అత్యంత శక్తివంతమైన, పెద్ద యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను ఇందులో ఉపయోగించనున్నట్లు సమాచారం. దీని వల్ల ప్రస్తుత తరం చిప్‌లు కూడా తదుపరి తరం ప్రాసెసర్ స్థాయికి దగ్గరగా పనితీరు ఉండనుంది. iQOO 15 Ultraను “ఇండస్ట్రీ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అల్ట్రా”గా నిలిపేలా కంపెనీ ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

iQOO 15 Ultraలో పరిశ్రమలోనే అత్యంత పెద్ద ఇన్‌బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ను అందించే అవకాశం ఉంది. ఇంకా ఈ ఫోన్‌లో తాజా Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ను ఉపయోగించే అవకాశం ఉంది. డిజైన్ పరంగా కూడా సాధారణ iQOO మోడళ్లకు భిన్నంగా, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో రావచ్చని సమాచారం. పవర్ బ్యాకప్ కోసం 7000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించే అవకాశాలు ఉన్నాయి.
కెమెరా విభాగంలో 50MP OIS ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP 3x టెలిఫోటో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుందని అంచనా. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు. ఇంకా అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, మెటల్ ఫ్రేమ్, USB 3.2 సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది.