అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరంలో చర్చి సేవకు హాజరైన కేథలిక్ పాఠశాల పిల్లలపై దుండగుడు కాల్పులు జరపడంతో 8, 10 ఏళ్ల వయసు గల ఇద్దరు విద్యార్థులు చనిపోగా.. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో 17 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనను ఎఫ్ఐబీ ఉగ్రవాద చర్యగా పేర్కొంది.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
అయితే సంఘటన తర్వాత ఎఫ్ఐబీ అధికారులు దర్యాప్తు చేపట్టగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుండగుడి తుపాకులు, మ్యాగ్‌జైన్లపై పలు రాతలు కనిపించాయి. అందులో ‘డొనాల్డ్ ట్రంప్‌ను చంపేయండి.. ఇప్పుడే చంపేయండి.’ (Kill Donald Trump Now), ‘న్యూక్ ఇండియా’ (Nuke India), ఇజ్రాయెల్ మస్ట్ ఫాల్ (Israel must fall), బర్న్ ఇజ్రాయెల్ (Burn Israel), వేర్ ఈజ్ గాడ్ (Where is your God?), ఫర్ ది చిల్ట్రన్ (For the children) అని రాసి ఉన్నాయి. ఈ రాతలు చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఇదేదో తీవ్రమైన చర్యగా అభిప్రాయపడ్డారు. ఇక నిందితుడు రాబిన్ వెస్ట్‌మన్(23)గా గుర్తించారు. 2020లో పురుషుడి నుంచి మహిళగా లింగమార్పిడి చేసుకుని.. రాబర్ట్ నుంచి రాబిన్‌గా పేరు మార్చుకున్నాడు.
ఇది కూడా చదవండి: PEDDI : ‘పెద్ది’.. రామ్ చరణ్ ఇంట్రో కోసం భారీ ప్లాన్
ఇక నిందితుడు రాబిన్ పాఠశాలపై కాల్పులు జరపకముందు తుపాకులు, మ్యాగజైన్‌లు, మేనిఫెస్ట్‌ను చూపించే 11 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొంత కాలం క్రితం యూట్యూట్‌లో కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక వీడియోలో 150 పేజీలకు పైగా రాతలు కలిగిన బుక్ కనిపించింది. రెండోది 21-08-2025న 60 పేజీల రాతలు కలిగిన బుక్ కనిపించింది.
కేథలిక్ పాఠశాల లక్ష్యంగా మూడు ఆయుధాలను ఉపయోగించి కాల్పులు జరిపాడు. విచక్షణరహితంగా డజన్ల కొద్దీ రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా కనుగొన్నారు. అనంతరం స్కూల్ పార్కింగ్ స్థలంలో తనకు తానుగా కాల్చుకుని రాబిన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రాబిన్ వెస్ట్‌మన్ ఆయుధాలను చట్టబద్ధంగా కొనుగోలు చేశాడని.. అతనికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని.. ఒంటరిగానే ఈ చర్యకు పాల్పడినట్లుగా అధికారులు తెలిపారు. ఈ స్థాయి హింసను ఊహించలేకపోయామని యూఎస్ హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తెలిపారరు. తీవ్ర అనారోగ్యం కారణంగానే హంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా అభిప్రాయపడింది.

ఇక ఈ సంఘటనపై ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా అమెరికా జెండాను సగం అవనతం చేయాలని ట్రంప్ ఆదేశించారు.
ఎఫ్‌బీఐ ప్రకారం.. మిన్నియాపాలిస్‌లోని అనౌన్సియేషన్ కాథలిక్ స్కూల్‌లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది చిన్నారులు గాయపడ్డారని పేర్కొంది. అనంతరం దుండగుడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పింది. ఇది దేశీయ ఉగ్రవాద చర్య అని.. అంతేకాకుండా ద్వేషపూరిత నేరంగా ఎఫ్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లుగా స్పష్టం చేసింది. కేథలిక్కులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లుగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అభిప్రాయపడ్డారు.
https://twitter.com/LeftismForU/status/1960773594855641316