Israel-Iran: ఇజ్రాయెల్‌కు మరింత సైనిక సామగ్రిని అందిస్తున్న అమెరికా..
- ఇజ్రాయెల్‌కు మరింత సైనిక సామగ్రిని అందిస్తున్న అమెరికా..
- దీర్ఘశ్రేణి బీ-52 బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. బాలిస్టిక్ క్షిపణులను ధ్వసం చేసే మిషన్లు..
- వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలించబోతున్నట్లు వెల్లడించిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు హెచ్చరికగా యూఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి మరింత సైనిక సామగ్రిని ఇజ్రాయెల్ కు తరలిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్.. దాని మద్దతుదారులు అమెరికన్ పౌరులను, సిబ్బందిని టార్గెట్ చేస్తే.. వారిని రక్షించేందుకు మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలించబోతున్నట్లు తెలిపారు.
Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పులు.. అది రద్దు.. రిషికొండ చేరిక..
Also Read
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
ఇక, తాజాగా తరలిస్తున్న సైనిక సామగ్రిలో దీర్ఘశ్రేణి బీ-52 బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వసం చేసే మిషన్లు ఉంటాయని అమెరికా చెప్పుకొచ్చింది. కాగా, ఇటీవల టెర్మినల్ ‘హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (THAAD)’తో పాటు సైనిక దళాలను ఇజ్రాయెల్‌కు పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే మరిన్ని ఆయుధాలు పంపేందుకు రెడీ అవడం గమనార్హం.
అయితే, అక్టోబరు 1వ తేదీన టెల్‌అవీవ్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది.
Read Also: Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..
అయితే, ఈ దాడులకి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో టెహ్రాన్‌కు చెందిన నలుగురు సైనికులు చనిపోగా.. క్షిపణి తయారీ కేంద్రాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ ప్రతికార దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ అంశాన్ని తీవ్రతరం చేయొద్దని పలు దేశాలు ఇరాన్‌కు సూచలను జారీ చేశాయి. ఈ క్రమంలోనే యూఎస్ మరింత ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్ కు అందించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!