ధనిక వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ ఆఫర్ ప్రకటించారు. అమెరికా పౌరసత్వం కావాలంటే.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారికి ‘గోల్డ్ కార్డు’ జారీ చేస్తామని ప్రకటించారు. 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే ఏ విదేశీ వలసదారులకైనా పౌరసత్వం ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలు రెండు వారాల్లో వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు.
ఇది కూడా చదవండి: SLBC Tunnel Accident: కార్మికుల ఆచూకీ కోసం ‘ఆపరేషన్ మార్కోస్’!
అమెరికాలో ఉద్యోగాలు సృష్టించే వారికి.. లేదంటే పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్‌బీ-5 ‘గ్రీన్ కార్డులు’’ మంజూరు చేస్తామని ట్రంప్ చెప్పారు. ఈ కార్డు ధరను 5 మిలియన్లు నిర్ణయించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్డు ద్వారా సంపన్నులు అమెరికాలోకి ప్రవేశించొచ్చని ఆఫర్ ప్రకటించారు. ఈ కార్డు ద్వారానే అమెరికా పౌరసత్వం పొందుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ పథకానికి రష్యన్లు కూడా అర్హత పొందుతారని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: SLBC Tunnel Accident: కార్మికుల ఆచూకీ కోసం ‘ఆపరేషన్ మార్కోస్’!
ఈ తరహా ‘గోల్డెన్ వీసా’లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం కోటి గోల్డ్ కార్డ్‌లను ఇవ్వనున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kejriwal: రాజ్యసభకు కేజ్రీవాల్.. ఏ రాష్ట్రం నుంచంటే..!