ధనిక వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ ఆఫర్ ప్రకటించారు. అమెరికా పౌరసత్వం కావాలంటే.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారికి ‘గోల్డ్ కార్డు’ జారీ చేస్తామని ప్రకటించారు. 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే ఏ విదేశీ వలసదారులకైనా పౌరసత్వం ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలు రెండు వారాల్లో వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు.