అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం భారీగా సుంకాలు పెంచేశారు. వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయే పరిస్తితి ఏర్పడింది.
ధనిక వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ ఆఫర్ ప్రకటించారు. అమెరికా పౌరసత్వం కావాలంటే.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారికి ‘గోల్డ్ కార్డు’ జారీ చేస్తామని ప్రకటించారు. 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే ఏ విదేశీ వలసదారులకైనా పౌరసత్వం ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలు రెండు వారాల్లో వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు.
Antony Blinken: గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటానన్న డొనాల్డ్ ట్రంప్ మాటలను పట్టించుకొని టైమ్ వేస్టు చేసుకోవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. అసలు అది జరిగే పని కాదన్నారు.
Donald Trump: పెన్సిల్వేనియాలో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హరీస్ భారీ లీడింగ్ సాధించింది. పెన్సిల్వేనియాపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయనకు తగిన లీడ్ రాకపోవడంతో తీవ్ర ఆరోపణలు చేశారు.