ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి చార్లీ కిర్క్ విశేష కృషి చేశారు. ఇక చార్లీ కిర్క్ హత్య తర్వాత ఆయన అభిమానులు, ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చేది ఎప్పుడంటే..!
ఇలాంటి సమయంలో చార్లీ కిర్క్ హత్యపై టెలివిజన్ హోస్ట్ జమ్మీ కిమ్మెల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అతనిలో ఏదో తప్పు ఉంది కాబట్టే ఇలా జరిగిందంటూ చార్లీ కిర్క్‌ను ఉద్దేశించి జమ్మీ కిమ్మెల్ పేర్కొన్నాడు. అంతేకాకుండా ట్రంప్ తీరును కూడా తప్పుపడుతూ వ్యాఖ్యానించాడు. చార్లీ కిర్క్‌కు సంతాపాన్ని వ్యక్తం చేసే సమయంలో ట్రంప్ దు:ఖించిన విధానాన్ని కూడా జమ్మీ కిమ్మెల్ ఎగతాళి చేశాడు. నాలుగేళ్ల పిల్లవాడు గోల్డ్ ఫిఫ్ కోసం దు:ఖించినట్లుగా ఉందని అపహాస్యం చేశాడు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటన
జిమ్మీ కిమ్మెల్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఏబీసీలో జిమ్మీ కిమ్మెల్ లైవ్‌షోను బహిష్కరిస్తున్నట్లు నెక్స్‌స్టార్ ప్రకటించింది. అతడి షోను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఇక ఈ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని డెమెక్రటిక్ శాసనసభ్యులు తప్పుపట్టారు. వాక్ స్వాతంత్ర్యం దాడికి గురవుతుందని అన్నారు. ఏబీసీ నిర్ణయంపై ఇంకా జిమ్మీ కిమ్మెల్ స్పందించలేదు.
నెక్స్‌స్టార్ మీడియా గ్రూప్.. 32 ఏబీసీ అనుబంధ సంస్థలు కలిగి ఉంది. జిమ్మీ కిమ్మెల్ షోలు వీటిల్లో ప్రసారం అవుతుంటాయి. అయితే చార్లీ కిర్క్ హత్యను అపహాస్యం చేయడంతో జిమ్మీ కిమ్మెల్ షోలను నిలిపివేస్తున్నట్లు ఏబీసీ ప్రకటన చేసింది. చార్లీ కిర్క్‌పై కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయని నెక్స్‌స్టార్ ప్రసార విభాగం అధ్యక్షుడు ఆండ్రూ ఆల్ఫోర్డ్ అన్నారు.
ఇదిలా ఉంటే సోమవారం టెక్సాస్ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ స్మారక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక విద్యార్థి ఎగతాళి చేశాడు. దీంతో యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
