Trump: తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
- హార్ముజ్‌పై ఒమన్-ఇరాన్ మధ్య ఒప్పందం
- ఒప్పందంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలు
- తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తామని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్ముజ్ జలసంధి రవాణా మార్గంపై ఒమన్-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడంపై అమెరికా అధ్యక్షుడు గరంగరం అయ్యారు. చాలా రోజులుగా ఒమన్ మధ్యవర్తిగా ఉండి.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒమన్ ఒంటరిగా ఇరాన్ ఒప్పందం చేసుకోవడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ, హార్ముజ్ జలసంధి విషయంలో ఒమన్ అడ్డుగా వస్తే ఆ దేశంపై కూడా తీవ్రంగా దాడి చేస్తామని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను నిర్వహించేందుకు గత కొన్ని వారాలుగా ఇరాన్ దౌత్యవేత్తలు ఒమన్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్-ఒమన్ మధ్య జరుగుతున్న సమాంతర చర్చలపై ట్రంప్‌ను ప్రశ్నించగా.. ఆయన తీవ్రంగా స్పందించారు.
Also Read
- Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
‘‘ఒమన్ అడ్డుగా వస్తే.. ఆ దేశంపై తీవ్రంగా దాడి చేస్తాం’’ అంటూ ట్రంప్ హెచ్చరించినట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొద్ది రోజుల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హార్ముజ్ జలసంధి ప్రస్తుతం మధ్యప్రాచ్య ఘర్షణల్లో అత్యంత కీలకమైన ఉద్రిక్తత కేంద్రంగా మారింది. ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు రవాణాకు ఈ జలమార్గం అత్యంత కీలకం కావడంతో ఇరాన్, అమెరికా మధ్య వివాదంలో హార్ముజ్ అంశం ప్రధానంగా మారింది.
ఇరాన్‌పై తన వైఖరిని కూడా ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ ‘‘తెల్ల జెండా ఎగరేసి లొంగిపోవాలి’’ అని వ్యాఖ్యానించినట్లు ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ ట్రే యింగ్స్ట్ ఎక్స్‌లో వెల్లడించారు. ‘‘వాళ్లు మంచి పోకర్ ఆటగాళ్లు.. కానీ చనిపోతున్నారు’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు సంబంధించి తనకు ఎలాంటి నిర్దిష్ట గడువు లేదని ట్రంప్ చెప్పారు. ‘‘నాకు ఎలాంటి టైమ్ షెడ్యూల్ లేదు. నేను తొందరపడటం లేదు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు నా ఆలోచనలతో ఎలాంటి సంబంధం లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూడటమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రూపంలోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనేదే ఎప్పటికీ మా ప్రధాన లక్ష్యం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ గడువు ముగింపు దశకు చేరుకున్న సమయంలో ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు, ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ వంటి అంశాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్-ఒమన్ మధ్య హార్ముజ్ జలసంధి నిర్వహణపై జరుగుతున్న చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు ట్రంప్ తాజా వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- Tags
- Donald Trump
- Oman
- trump
- Warning
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!