Egypt: ఈజిఫ్ట్ చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది. అక్కడి ఫారో రాజుల పరిపాలన, మమ్మీలు ఇలా అనేక వింతలకు పుట్టినిల్లు. చాలా మంది రాజులు, రాణులు సమాధుల్లో ఎంతో సంపద లభించడం మనం చూశాం. టూటెన్‌కామూన్ రాజుకు సంబంధించిన శాపం, అతని సమాధి నుంచి లభించిన వెలకట్టలేదని సంపద గురించి విన్నాం. ఇలా చాలా సమాధుల్లో అనేక అపురూప వస్తువలు లభించాయి. చనిపోయిన తర్వాత మమ్మీగా మార్చిన అనంతరం వారికి ఇష్టమైన వస్తువుల్ని వారి సమాధుల్లో ఉంచడం ఆనవాయితీ.