Ismail Haniyeh: ఇద్దరు ఇరాన్ ఏజెంట్లు, 3 గదుల్లో బాంబులు.. మొసాద్ డెడ్లీ ఆపరేషన్..
- ఇద్దరు ఇరాన్ ఏజెంట్లు..3 గదుల్లో బాంబులు..
- మొసాద్ డెడ్లీ ఆపరేషన్..
- ఇద్దరు ఇరాన్ ఏజెంట్లతో హనియే హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ismail Haniyeh: హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణస్వీకారానికి వచ్చిన ఆయనను రాజధాని టెహ్రాన్‌లో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో హత్య చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్ పర్యవేక్షణలో ఉన్న గెస్ట్ హౌజ్‌లో ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యకు సంబంధించి ఇజ్రాయిల్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు ఇరాన్, హమాస్, హిజ్బుల్లాలు ఈ దాడి ఇజ్రాయిల్ మొసాద్ చేసిందని ఆరోపిస్తోంది. దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
అయితే, గత కొన్నాళ్ల నుంచి హనియేని ఎలిమినేట్ చేయాలని ఇజ్రాయిల్ గూఢఛార సంస్థ మొసాద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇద్దరు ఇరాన్ ఏజెంట్లను మొసాద్ నియమించుకున్నట్లు ది టెలిగ్రాఫ్ నివేదించింది. ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలకు వచ్చిన సందర్భంలోనే హనియేని హత్య చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. విపరీతంగా రద్దీ ఉండటంతో ఆ ప్లాన్‌ని నిలిపేశారు. ప్లాన్ విఫలమయ్యే ప్రమాదం కూడా ఉండటంతో హనియే ఆపపరేషన్ ఆ సమయంలో ఆపేశారు.
Also Read
Read Also: Paris Olympics 2024: ఇమానే ఖలీఫ్ తర్వాత మరో వివాదాస్పద బాక్సర్..
హనియే ఎలిమినేట్ ఆపరేషన్ ఎలా సాగింది..?
దీంతో ఆపరేషన్ని కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార సమయానికి మార్చారు. ఉత్తర టెహ్రాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్ ఆధీనంలో ఉన్న గెస్ట్ హౌజులోనే హనియే ఉంటాడని ఇరాన్ ఏజెంట్లు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మూడు గదుల్లో బాంబులు పెట్టినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. ఇరాన్ అధికారుల వద్ద ఉన్న నిఘా ఫుటేజీలో, ఏజెంట్లు మూమెంట్స్ రికార్డయ్యాయి. ఇద్దరు నిమిషాల వ్యవధిలో రూముల్లోకి ప్రవేశించడం, నిమిషాల వ్యవధిలో నిష్క్రమించడం చూపిస్తుంది. హనియే ఉంటాడని అంచనా వేసిన రూముల్లో పరికరాలను ఉంచి, వారు గుర్తించబడకుండా ఇరాన్ నుంచి బయటకు వెళ్లారు. కానీ దేశంలోని సోర్సెస్‌ని కొనసాగించారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు, మొసాద్ ఏజెంట్లు హనియే బస చేసిన గదిని రిమోట్‌తో పేల్చేశారు.
మొసాద్ ఎలా పనిచేస్తుంది..?
3 బిలియన్ల వార్షిక బడ్జెట్‌తో 7000 మంది సిబ్బందితో ప్రపంచంలో అమెరికా సీఐఏ తర్వాత రెండో అతిపెద్ద గూఢచార ఏజెన్సీగా మొసాద్ ఉంది. మొసాద్ అనేక విభాగాలను కలిగి ఉంది. ఇది పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల్లోనే కాకుండా లెబనాన్, సిరియా, ఇరాన్ వంటి దేశాల్లో ఇన్ఫార్మర్లను, ఏజెంట్ నెట్వర్క్ని కలిగి ఉంది. మెట్సాడా అని కూడా పిలువబడే స్పెషల్ ఆపరేషన్ విభాగం, అత్యంత సున్నితమైన హత్యలు, విధ్వంసం వంటి యుద్ధకార్యక్రమాలను నిర్వహిస్తుంది.
- Tags
- Hamas
- Iran
- Ismail Haniyeh
- Israel
- Mossad
తాజావార్తలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!