పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. క్రమంగా కిందికి దిగివస్తున్నాయి బంగారం ధరలు.. శుక్రవారంతో పోలిస్తే.. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,400కి దిగిరాగా.. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గడంతో రూ.50,620కి పరిమితమైంది… ఇక, కిలో వెండి ధర రూ.58 వేలుగా ఉంది.. ఇక, ఆంధ్రప్రదేశలోనూ బంగారం రేటు ఇలాగే కొనసాగుతోంది.. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,400 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 110 తగ్గడంతో రూ.50,620కి పరిమితమైంది.. ఇక, ఏపీలోనూ కిలో వెండి ధర రూ.58,000 దగ్గర కొనసాగుతోంది.. అయితే, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.46,500 ఉంటే.. 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.50,730 దగ్గర కొనసాగుతోంది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,780గా ఉంది.. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 దగ్గర కొనసాగుతోంది.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్.. రూ.150 తగ్గి రూ.46,950గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి.. రూ.51,220కి చేరింది. మరోవైపు.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.50,620కి దిగొచ్చింది. పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,430గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,650 దగ్గర కొనసాగుతోంది.