Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhatrapati Sambhaji Maharaj Jayanti 2026: భారతీయ చరిత్రలో ధైర్యసాహసాలకు, అజేయమైన సంకల్పానికి మారుపేరు ఛత్రపతి శంభాజీ మహారాజ్. నేడు ఆ మహనీయుడి జయంతి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడైన శంభాజీ, మే 14, 1657న పురందర్ కోటలో శివాజీ, సాయిబాయి దంపతులకు జన్మించారు. దురదృష్టవశాత్తూ ఆయనకు రెండు ఏళ్ల వయసున్నప్పుడే తల్లి మరణించడంతో, తండ్రి శివాజీకి మార్గదర్శిగా నిలిచిన రాజమాత జిజాబాయి పర్యవేక్షణలోనే శంభాజీ పెరిగారు. పిలాజీ షిర్కే కుమార్తె జీవూబాయిని వివాహం చేసుకున్నారు.
1681లో సింహాసనాన్ని అధిష్టించిన శంభాజీ, తన తండ్రి ఆశయమైన ‘హిందవీ స్వరాజ్యాన్ని’ కాపాడటంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. కేవలం యుద్ధ వీరుడిగానే కాకుండా, అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్న గొప్ప పండితుడిగా ఆయనకు పేరుంది. 1681 నుంచి 1689 వరకు సాగిన శంభాజీ పాలనలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించకుండా అడ్డుకోవడంలో శంభాజీ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మొఘలుల కీలక నగరం బుర్హాన్‌పూర్‌పై ఆయన జరిపిన దాడి వారిని వణికించింది. సొంత కోటలోనే కొందరు శంభాజీ ప్రాణాలు తీయాలని కుట్రలు పన్నినప్పటికీ, వాటన్నింటినీ ఎదుర్కొని సామ్రాజ్యాన్ని విస్తరించారు.
Also Read
- India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
- Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
అయితే 1689లో శంభాజీని ఔరంగజేబు బందీగా పట్టుకున్నాడు. ఇస్లాంలోకి మారాలని చిత్రహింసలు పెట్టారు. కొన్ని రోజుల పాటు ఆయన్ని తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినా, శంభాజీ తన విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. చివరకు మార్చి 11, 1689న ఆయనను మొఘలులు అత్యంత కిరాతకంగా చంపారు. మరణం కళ్లముందు కనిపిస్తున్నా ఆయన చూపిన ధైర్యం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. శంభాజీ మహారాజ్ జీవితం పిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకం. క్రమశిక్షణ, దేశభక్తి, విద్యా ప్రాధాన్యత, కష్టకాలంలో నిలబడే మనస్తత్వాన్ని ఆయన జీవితం నేర్పిస్తుంది. ప్రస్తుతం శంభాజీ వీరగాథను నేటి తరానికి పరిచయం చేస్తూ బాలీవుడ్లో ‘ఛావా’ (Chhava) అనే సినిమా రూపొందింది. మరాఠీలో ‘ఛావా’ అంటే ‘సింహం పిల్ల’ అని అర్థం. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ పాత్రను పోషించగా.. రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, దివ్య దత్తా, డయానా పెంటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మరాఠా సామ్రాజ్య వైభవాన్ని, శంభాజీ త్యాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. నేడు శంభాజీ జయంతి (మే 14) సందర్భంగా ఆయన చూపిన పట్టుదల, ధైర్యం ప్రతి భారతీయుడి గుండెల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!