Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- రాజస్థాన్ పర్బత్సర్ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం.
- బీజేపీ అభ్యర్థి కైలాష్ చంద్రకు ఒక్క ఓటు మాత్రమే వచ్చింది.
- తన ఓటు కూడా వేసుకోలేని పరిస్థితి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ హవా నడుస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుంది. అయితే, దిద్వానా-కుచమన్ జిల్లాలోని పర్బత్సర్ మున్సిపాలిటీలో ఫలితం మాత్రం బీజేపీని షాక్‌కు గురిచేస్తోంది. బీజేపీ అభ్యర్థి కైలాస్ చంద్రకు కేవలం ఒకే ఓటు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా.. ఆయన తన ఓటును కూడా తనకు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పర్బత్సర్ మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి బీజేపీ తరుఫున కైలాస్ చంద్ర పోటీ చేశారు. ఇదే సమయంలో 20వ వార్డు నుంచి పోటీ చేసిన ఆర్ఎల్పీ అభ్యర్థి భన్వర్ లాల్‌కు కూడా ఒకే ఒక్క ఓటు వచ్చింది.
అసలు కారణం ఇదే..
నిజానికి కైలాస్ చంద్ర 12వ వార్డు ఓటర్. ఆయితే ఆయనను 13వ వార్డు నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. 13వ వార్డులో పార్టీకి అభ్యర్థి దొరక్కపోవడంతో కైలాస్ చంద్రను పార్టీ నామినేషన్ దాఖలు చేయాలని పార్టీ కోరింది. పార్టీ ఆదేశాల మేరకు అక్కడ పోటీ చేసినా, ఆయన ఓటర్ కాలేకపోవడం, ఆయన కుటుంబీకులు, అనుచరులు కూడా 12వ వార్డులోనే ఉండటంతో ఒకే ఓటు నమోదైంది. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి హీనా ఖాన్ 376 ఓట్లు సాధించి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి రషీద్ ఖాన్‌కు 195 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కైలాష్ చంద్ర మాత్రం ఒక్క ఓటుతో సరిపెట్టుకున్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇదే సమయంలో బీజేపీకి 13వ వార్డులో అభ్యర్థి దొరక్కపోవడంతోనే కైలాస్ చంద్రను బరిలో నిలిపినట్లు వార్డులో వార్త వ్యాపించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా ఉండేందుకు బీజేపీ తరుఫున నామినేషన్ వేయించినట్లు వాదన ఉంది. ఇదే ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) అభ్యర్థి భన్వర్ లాల్ ఒకే ఓటు వచ్చింది. ఈ ప్రాంతంలో ఆర్ఎల్పీకి గణమైన మద్దతు ఉన్నప్పటికీ ఈ ఫలితం వచ్చింది.
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!