వెళ్ళి పడుకో..ఏపీ బిజేపి లీడర్ విష్ణువర్ధన్ రెడ్డిపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజేపి నాయకులపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వచ్చాయని, అంతేగాక అత్యాచారం బెదిరిపులు కూడా వచ్చాయని హీరో సిద్దార్థ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు బిజేపి, ఈ హీరో కు మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ వివాదం కాస్త దేశ వ్యాప్తంగా వివాదాస్పదం అయింది. అటు తేజస్వి సూర్యను కూడా సిద్దార్థ్ టార్గెట్ చేశాడు. తేజస్వి సూర్యను టెర్రరిస్ట్ తో పోల్చాడు సిద్దార్థ్. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏపీ బిజేపి లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి సిద్దార్థ్ కు చురకలు అంటించారు. సిద్దార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకు హీరో సిద్దార్థ్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. నేను అసలైన భారతీయున్ని, సక్రమంగా పన్ను కడుతున్నానని.. వెళ్ళి పడుకో విష్ణు… ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి విష్ణు అంటూ కౌంటర్ ఇచ్చాడు సిద్దార్థ్. “దావూద్ నా టిడిఎస్ చెల్లించడానికి సిద్ధంగా లేడు. నేను పరిపూర్ణ పౌరుడిని, పన్ను చెల్లింపుదారున్ని విష్ణు. వెళ్ళి పడుకో. బిజెపి రాష్ట్ర కార్యదర్శి అంటా. సిగ్గుండాలి.” అంటూ ట్వీట్ చేశాడు.
Also Read
- Tags
- ap
- bjp
- hero siddarth
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!