Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్‌కు ఎక్కడ చెడింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్‌కి కోపం వచ్చింది.. ఎంతగా అంటే.. బండబూతులు తిట్టేంతగా..! ఇంతకీ ఎవర్ని తిట్టారో తెలుసా ? చైనా అధ్యక్షుడినో… ఇరాన్ పాలకులనో కాదు.. అత్యంత ప్రియ మిత్రుడు నెతన్యాహూని.! అదేంటి ఆయన కోసమే కదా… ఇరాన్‌పై యుద్ధం మొదలు పెట్టింది.. మరి ఆయన్నే ఎందుకు బూతులు తిట్టారు అనే కదా మీ డౌట్.. ట్రంప్ అంతే… ! కోపం నషాళానికి అంటుకుంటే… ఫ్రెండ్ అయినా… ఎనీమీ అయినా ఆయనకు ఒకటే…! నేను లేకపోతే నువ్వు జైలుకు వెళ్లే వాడివి… నీ హద్దుల్లో నువ్వు ఉండు అంటూ ఇచ్చిపడేశారు..! ఇంతకీ నెతన్యాహూపై ఎందుకంత ఆగ్రహం..?
నేను లేకపోతే నువ్వు జైలుకు వెళ్లేవాడివి:
డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఫైర్ అయ్యారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రతరం చేయడంతో ట్రంప్‌కు కోపం కట్టలు తెంచుకుంది. నేను లేకపోతే నువ్వు జైలుకు వెళ్లేవాడివి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న కీలక చర్చలకు ఇజ్రాయెల్ దాడులు ఆటంకం కలిగిస్తాయని ట్రంప్ మండిపడ్డారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్లో ట్రంప్.. నెతన్యాహూకి గట్టిగానే చీవాట్లు పెట్టారు.
ఇంకా చెప్పాలంటే బూతులతో విరుచుకుపడ్డారు. నెతన్యాహు చర్యల వల్ల ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఏకాకి అవుతోందని ట్రంప్ హెచ్చరించారు. నువ్వు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావు.. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి అని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నిన్ను నేనే కాపాడుతున్నాను.. నీ చర్యల వల్ల ఇప్పుడు అందరూ నిన్ను అసహ్యించుకుంటున్నారు.. ఇజ్రాయెల్‌ను కూడా వ్యతిరేకిస్తున్నారంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం ఆలోచించకుండా నెతన్యాహు తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు.. నీకు అర్థమవుతుందా అంటూ నిలదీశారు.
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
బీరూట్ లోని దక్షిణ శివారు ప్రాంతాల్లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దక్షిణలెబనాన్ లో గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా విస్తృతం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రితో కలిసి నెతన్యాహు దాడులకు ఆదేశాలు ఇచ్చారు. హెజ్బొల్లా పదేపదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ దాడుల వల్ల పెద్ద ఎత్తున ప్రాంతీయ యుద్ధం వస్తుందనే భయాలు మొదలయ్యాయి. లెబనాన్ రాజధాని బీరూట్ శివారు ప్రాంతాల నుంచి ప్రజలు ప్రాణభయంతో వలస వెళ్తున్నారు. మరోవైపు హెజ్బొల్లాకు మద్దతు ఇస్తున్న ఇరాన్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పింది. అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చలకు కూడా విఘాతం కలుగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. లెబనాన్ లో కాల్పుల విరమణ జరిగితేనే అమెరికాతో ముందుకెళ్తామని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.
ట్రంప్ భయపడ్డారా?
హెజ్బొల్లా చేస్తున్న రాకెట్.. డ్రోన్ దాడులకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ స్పందిస్తోందని ట్రంప్ కు తెలుసు. ఆ విషయాన్ని అమెరికా అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ నెతన్యాహు.. తన దూకుడు స్వభావంతో పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారని ట్రంప్ భావిస్తున్నారు. పౌరుల ప్రాణనష్టం పెరుగుతుండటంపై ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క హెజ్బొల్లా కమాండర్ కోసం పెద్ద ఎత్తున దాడులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. లెబనాన్ వివాదం వల్ల అమెరికా-ఇరాన్ చర్చలు ఆగిపోతాయనేది ట్రంప్ ప్రధాన భయం. ఇరాన్ తో చర్చలు చాలా వేగంగా సాగుతున్నాయని ట్రంప్ నమ్ముతున్నారు. అందుకే నెతన్యాహు దూకుడుకు కళ్లెం వేయాలని ఆయన భావించారు.
ఫోన్లో నెతన్యాహూని పిచ్చ తిట్లు తిట్టిన తర్వాత ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. నెతన్యాహుతో చాలా నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినట్లు రాసుకొచ్చారు. బీరూట్‌కు ఎలాంటి బలగాలు వెళ్లవని స్పష్టం చేశారు. మధ్యవర్తుల ద్వారా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ పై దాడులు ఆపేందుకు అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ఒత్తిడితో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నా నెతన్యాహు వైఖరిలో పెద్దగా మార్పు రాలేదు. దక్షిణ లెబనాన్ లో ఆపరేషన్స్ కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హెజ్బొల్లా దాడులు ఆపకపోతే బీరూట్ పై దాడులు చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు.
ఇజ్రాయెల్… మధ్యప్రాశ్చంలో తమ ప్రయోజనాల కోసం అమెరికాను గట్టిగానే వాడుకుంటోంది. ట్రంప్ కూడా సహకరిస్తూ వచ్చారు. అయితే నెతన్యాహూ వైఖరిపై మాత్రం ఇటీవల ట్రంప్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఈ స్థాయిలో రచ్చ జరగడం ఇదే తొలిసారి. ఇరాన్ యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియని సమయంలో ట్రంప్-నెతన్యాహూు రిలేషన్ ఇకపై ఎలా ఉండబోతోంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది..
: ఫణి కుమార్ (NTV DIGITAL)
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!