Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI..మనిషి నియంత్రణ దాటితే ఏం జరుగుతుందనే భయం ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది.. ఆ భయం ఇప్పుడు ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే కథలా లేదు. ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలోనే ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీల అధినేతలు దీని గురించి హెచ్చరించే స్థాయికి చేరుకుంది.
న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ఆంథ్రోపిక్ సంస్థ సీఈవో డారియో అమోడీ చేసిన హెచ్చరిక మరింత కలవరపెడుతోంది. ఏఐ అభివృద్ధిని, దాని వినియోగాన్ని సరిగ్గా నిర్వహించకపోతే అది మొత్తం మానవాళికే ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అంటే ఇప్పటివరకు మనిషి తన తెలివితో సృష్టించిన సాంకేతికతే ఒక దశలో మనిషి ఉనికికే ముప్పుగా మారే పరిస్థితిని ఊహించాల్సి వస్తోంది.
Also Read
ఇక్కడ అసలు భయంకరమైన విషయం ఏంటంటే ఏఐ రోజురోజుకీ మరింత శక్తివంతంగా మారుతోంది. దాని సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ దాన్ని నియంత్రించే బాధ్యత కూడా అంతే పెద్దదిగా మారుతోంది. ఒక్క కంపెనీ, ఒక్క దేశం లేదా ఒక్క నాయకుడు ఈ సమస్యను ఒంటరిగా ఎదుర్కోలేరని అమోడీ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కూడా ఏఐ విషయంలో ప్రభుత్వాల పాత్ర ఉండాలని చెప్పారు. భవిష్యత్తులో ఏఐకి సంబంధించిన అత్యంత కీలక నిర్ణయాలు కొన్ని టెక్ కంపెనీల కార్యాలయాల్లో మాత్రమే తీసుకునే పరిస్థితి ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా ఆ నిర్ణయాల్లో భాగం కావాలని ఆయన సూచించారు.
అయితే ఈ భయానికి మరో కోణం కూడా ఉంది. ఏఐని ఉపయోగించేది మనుషులే. అదే టెక్నాలజీ దాడి చేయడానికి కూడా ఉపయోగపడొచ్చు, దాడిని అడ్డుకోవడానికి కూడా ఉపయోగపడొచ్చు. హగ్గింగ్ ఫేస్ సహ వ్యవస్థాపకుడు క్లెమెంట్ డెలాంగ్ చెప్పిన అనుభవం దీనికి ఉదాహరణ. తమ సంస్థపై ఏఐ ఆధారిత దాడి జరిగిందని, చివరికి అదే ఏఐని ఉపయోగించి దాన్ని ఎదుర్కొన్నామని ఆయన వెల్లడించారు. మరింత ఆసక్తికరంగా, తమ రక్షణ కోసం చైనా రూపొందించిన ఒక ఏఐ మోడల్‌ను ఉపయోగించామని చెప్పారు.
అంటే రేపటి సైబర్ ప్రపంచంలో మనిషి వర్సెస్ ఏఐ అనే పోరాటం మాత్రమే ఉండకపోవచ్చు. ఒక ఏఐ మరో ఏఐతో పోరాడే పరిస్థితి కూడా రావచ్చు. ఎవరి చేతిలో ఏఐ ఉంటుంది, అది ఎంత శక్తివంతంగా ఉంటుంది, దాన్ని ఎవరు ఎలా ఉపయోగిస్తారు అనే ప్రశ్నలు ఇప్పుడు దేశాల భద్రతతోనే ముడిపడుతున్నాయి. అందుకే ఐక్యరాజ్యసమితి వేదికపై ఏఐ నియంత్రణ గురించి చర్చ జరుగుతోంది. అమెరికా మాత్రం ప్రపంచం మొత్తానికి ఒకే రకమైన నియంత్రణ వ్యవస్థ తీసుకురావడంపై భిన్నమైన వైఖరి వ్యక్తం చేసింది. చైనా మాత్రం దేశాల మధ్య మరింత సమన్వయం, నియంత్రణ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాలు అవసరమని చెబుతోంది.
ఇన్ని విభిన్న అభిప్రాయాల మధ్య ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ భవిష్యత్తు గురించి మాట్లాడే దశ దాటి, దాని శక్తిని ఎలా నియంత్రించాలనే దశకు ప్రపంచం వచ్చేసింది. మనిషి సృష్టించిన తెలివైన యంత్రం ఎప్పటికీ మనిషి చెప్పినట్టే వింటుందా? లేదా ఒకరోజు మనిషి తన చేతులతో సృష్టించిన శక్తినే నియంత్రించడానికి పరుగులు తీయాల్సి వస్తుందా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న అతిపెద్ద ప్రశ్న.
- Tags
- AI
- Explainers in Telugu
తాజావార్తలు
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!