బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఈ న్యూస్.. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 500 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, చివరి తేదీ మొదలగు విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య: 500
పోస్టుల వివరాలు..
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(జేఏఎం)-500 పోస్టులు..
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు..
01.11.2023 నాటికి 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం – ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వూ
దరఖాస్తు ఫీజు – ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 200 చెల్లించాలి. మిగతావారు రూ. 1000 దరఖాస్తు రుసుం చెల్లించాలి.
దరఖాస్తు విధానం – ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభం – 12 ఫిబ్రవరి, 2024
దరఖాస్తులకు తుది గడువు – 26 ఫిబ్రవరి, 2024.
పరీక్ష తేదీ – మార్చి 17, 2024.
అధికారిక వెబ్ సైట్ – https://www.idbibank.in/
అప్లై చేసుకోండిలా…
ముందుగా https://www.idbibank.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోం పేజీలో కెరీర్ లింక్ పై క్లిక్ చేయాలి.
Current Openings లో JAM 2024 recruitment అనే ఆప్షన్ పై నొక్కాలి.
రిజిస్ట్రర్ ప్రాసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు.
దరఖాస్తు రుసుమును చెల్లించాలి..
ఆ తర్వాత సబ్మిట్ నొక్కాలి.. ఆ తర్వాత ప్రింట్ తీసుకోవాలి..
ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ https://www.idbibank.in/ ను పరిశీలించగలరు..