నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏకంగా 995 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల వివరాలు.. 995
అర్హతలు..
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులవ్వాలి..
వయసు..
15.12.2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
టైర్-1 రాతపరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3/ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం..
టైర్-1 రాతపరీక్ష ఆబ్జెక్టివ్, టైర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. టైర్-1 పరీక్షలో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్/లాజికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్-2 పరీక్షలో ఎస్సే, ఇంగ్లిష్, కాంప్రహెన్షన్, ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. 100 మార్కులతో టైర్-3/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు..
జీతం..
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది..
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.12.2023
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేది: 19.12.2023
ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెబ్‌సైట్: https://www.mha.gov.in/en or https://www.ncs.gov.in/ ను సందర్శించగలరు..