Waking Up to Alarm Increases Heart Attack Risk: మార్నింగ్ అలారం పెట్టుకుంటే ప్రమాదమా..?
- అలారం పెట్టుకుని పడుకుంటే గుండెపోటు,
- బీపీ పెరిగే ప్రమాదం
- 32 మందిపై పరిశోధన చేసిన వర్జీనియా విశ్వవిద్యాలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది ఉదయాన్నే లేవాలంటే బద్దకిస్తారు.. కొంత మంది టైంకి లేవాలని.. అలారం పెట్టుకుని పడుకుంటారు. అలారం మోగే సరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తారు. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వర్జీనియా విశ్వవిద్యాలయం అధ్యయనంలో తెలిసింది. 32 మందిపై చేసిన ఈ పరిశోధనలో, అలారం ఉపయోగించి లేచిన వారిలో రక్తపోటు 74 శాతం పెరిగిందని కనుగొన్నారు. సహజంగా లేచేవారితో పోలిస్తే ఇది గణనీయమైన వ్యత్యాసం.
పొద్దున్నే నిద్రలేవడానికి చాలా మంది అలారం పెట్టుకుంటారు. ఉదయమే ఆఫీస్‌కు వెళ్లేందుకో, కాలేజ్‌కు వెళ్లేందుకో లేదా మరేదైనా పని ఉన్నా.. ఆ సమయానికి లేవలేము అనుకునే వాళ్లంతా అలారంపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారందరికీ మతిపోయే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అలారం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటా.. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విషయాన్ని వింటే మీరే షాకవుతారు.
మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. పొద్దుపొద్దున్నే వినిపించే అలారం మోతతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ముప్పును పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో తేలింది. 32 మందిపై ఈ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. రెండు రోజులపాటు వారంతా నిద్రలో స్మార్ట్ వాచ్లు, ఫింగర్ బ్లడ్ ప్రెజర్ కఫ్స్ ధరించి పాల్గొన్నారని చెప్పారు. మొదటిరోజు ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్రలేవమని ఆ 32 మందికి సూచించినట్లు పేర్కొన్నారు. రెండోరోజు.. ఐదు గంటలకు పైగా నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకొని లేవమని చెప్పి, ఈ రెండు ఫలితాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయన్నారు. సహజంగా, బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్ ప్రెజర్‌లో పెరుగుదలను గుర్తించినట్లు తెలిపారు.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే బలవంతంగా మేల్కొన్న వారిలో 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ రక్తపోటు పెరుగుదల నిద్ర తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడించారు. అలారం శబ్దం శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుందని, ఆ స్పందన కారణంగా కార్టిసోల్, అడ్రినలిన్ విడుదల అవుతుందన్నారు. ఈ హార్మోన్లు గుండె వేగాన్ని పెంచుతాయని, రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయని చెప్పారు. నిద్రలేవగానే ఇలా బీపీ పెరగడాన్ని మార్నింగ్ బ్లడ్ ప్రెజర్ సర్జ్ అని పిలుస్తారని చెప్పారు. ఇలా ఉదయం పూట అలారంతో బీపీ పెరగడం తాత్కాలికమే అయితే ప్రమాదం లేదు కానీ.. కానీ తరచూ అదే పరిస్థితి ఎదురయితే.. మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారికి ప్రమాదకరమని వెల్లడించారు. అయితే ప్రతీ రోజు ఒకే సమయానికి సహజంగా నిద్రలేచే అలవాటు చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!