Site icon NTV Telugu

ఇంటి ఓనర్ కొడుకు నిర్వాకం.. అద్దెకుంటున్న మహిళ నగ్న వీడియోలను..

film nagar

film nagar

సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోతుంది.మొన్నటికి మొన్న ఒక మహిళ స్నానం చేస్తుండగా కేబుల్‌ టెక్నిషియన్‌ వీడియో తీస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువకముందే మరో యువకుడు ఒక మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ నగర్ లోని మాగంటి కాలనీలో ఒక మహిళ, తన భర్తతో కలిసి నివాసముంటుంది. ఆ ఇంటి ఓనర్ కొడుకు దిలీప్ నిత్యం వారి ఇంటి వద్దే తచ్చాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మహిళ బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా దిలీప్ సెల్ ఫోన్ లో చిత్రీకరించడం గమనించిన మహిళ ఆ విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో భర్త, ఇంటి ఓనర్ తో కొడుకు గురించి చెప్పగా అతడు నా కొడుకు అలాంటివాడు కాదని వంత పాడాడు. ఇక దీంతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి విచారించగా.. మూడు నెలలు నుంచి ఆమె వీడియోలు తీస్తున్నట్లు తెలిపాడు.. అతడి ఫోన్ లో వందలకొద్దీ నగ్న వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకొని అతడిపై కేసు నమోదు చేశారు

Exit mobile version