Young Man Attach Neighbours For AC Water Issue: గోదావరిఖని హనుమాన్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కేవలం ఏసీ నీళ్లు పడుతున్నాయన్న కారణంతో.. పక్కింటి వారిపై కత్తితో దాడి చేశాడో యువకుడు. ఈ ఏసీ నీళ్లకు వ్యవహారంలో చాలా రోజుల నుంచే ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఆ సమస్యని పరిష్కరించమని సూచించినా.. పక్కంటివారు పట్టించుకోలేదు. ‘తమ ఇంట్లో నీళ్లు పడట్లేదుగా’ అన్నట్టు బేఖాతరు చేస్తూ వచ్చారు. తాజాగా మళ్లీ ఏసీ నీళ్లు పడటంతో కోపాద్రిక్తుడైన యువకుడు.. చేత కత్తి పట్టుకొని దాడికి దిగాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న గోదావరిఖని 1వ టౌన్ పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకసారి ఫిర్యాదు అందిన తర్వాత ఏసీ నుంచి నీళ్లు రాకుండా పరిష్కరించి ఉంటే, పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు. అటు.. కత్తితో దాడి చేసి, ప్రాణాలు తీసేంత పెద్ద సమస్య కూడా కాదు. పరస్పర చర్చలతో సమసపోయి సమస్యను.. ఇగోలు, ఆవేశాలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటున్నారు జనాలు.