Bengaluru: బెంగళూర్‌లో ఓ చెత్త లారీలో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. 30-35 ఏళ్లు ఉన్న మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో నింపి లారీలో విసిరేశారు. అయితే, ప్రస్తుతం మహిళ ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. మహిళ గుర్తింపు కోసం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Kolkata Rape Case: లా విద్యార్థినిపై అత్యాచారం.. తృణమూల్ కాంగ్రెస్‌లో విభేదాలు..
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో నిందితులు ఆటో రిక్షాలో వచ్చి చెత్త సంచిని లారీలో పడేస్తున్నట్లు కనిపిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు హంతకులను వెతుకుతున్నారు. ఈ ఘటనపై చన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సి వంశీ కృష్ణ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటల మధ్య ఆ సంచిని చెత్త లారీలో పడేసినట్లు తెలిపారు. మహిళ కాళ్లు, చేతుల్ని కట్టివేసి గోనె సంచిలో కట్టారని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.