Bengaluru: బెంగళూర్‌లో ఓ చెత్త లారీలో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. 30-35 ఏళ్లు ఉన్న మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో నింపి లారీలో విసిరేశారు. అయితే, ప్రస్తుతం మహిళ ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. మహిళ గుర్తింపు కోసం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్‌లో మహాలక్ష్మీ (29) అనే మహిళ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర సంచలనంగా మారింది. మహాలక్ష్మీని ముక్కలు.. ముక్కలుగా నరికి గదిలో రిఫ్రిజిరేటర్‌లో పెట్టడంతో దుర్వాసన వెదజల్లింది. దాదాపు 50 ముక్కలుగా నరికివేయబడింది.