Wife Kills Husband: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. రోడ్డు ప్రమాదమని నాటకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల మూలంగా సంసారాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రియుడిని హత్య చేయడమో లేక భర్తనే ప్రియుడి సాయంతో భార్య హతమార్చడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. జమ్మూకి చెందిన ఓ మహిళ ప్రియుడి సాయంతో తన భర్తను హతమార్చింది.
వివరాల్లోకి వెళ్తే.. 33 ఏళ్ల భర్తను ప్రియుడి సాయంతో హతమార్చి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఓ భార్య ప్రయత్నించి పట్టుబడింది. ఈ కేసులో సదరు మహిళ, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. దోడాలోని భద్వేరాకు చెందిన నరేష్ చందర్‌ని ఏప్రిల్ 7 తెల్లవారుజామున జమ్మూలోని గాంధీనగర్ ఆస్పత్రికి అతని భార్య షల్లుదేవీ తీసుకువచ్చారు. నగరంలోని పౌనిచక్‌లోని గోలే గుజ్రాల్ ప్రాతంలో ప్రమాదం జరిగి చందర్ గాయపడ్డాడని పేర్కొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందుగా షల్లూదేవీ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. నరేష్ చందర్ మృతిపై పోస్టుమార్టం నిర్వహించి దోమన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
Read Also: Yogi Adityanath: బాణాసంచా పేలినా పాకిస్తాన్ వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది..
అయితే, దర్యాప్తులో షల్లూదేవీ చెప్పే విషయాలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పోలీసులు గుమనించారు. దీని ప్రకారం సాంకేతిక ఆధారాలు సేకరించారు. చందర్ చనిపోయిన గాంధీ నగర్ ఆస్పత్రిలో ట్రైనీగా పనిచేస్తున్న భాను ప్రతాప్ సింగ్‌తో షల్లూదేవికి అక్రమ సంబంధం ఉన్నట్లు సమగ్ర విచారణలో తేలింది. నిందితులు షల్లూదేవీ, ప్రతాప్ సింగ్‌లు నరేష్ చందర్‌ని సియోరా గ్రామంలో పాడుబడిన స్థలానికి రప్పించి హత్య చేసినట్లు అంగీకరించారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదమని నాటకమాడి తప్పించుకునే ప్రయత్నం చేశారు. భాను సింగ్ ఆదే ఆస్పత్రిలో పనిచేస్తుండటంతో హత్య కేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిపై హత్యానేరం మోపబడింది. తదుపరి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!