Bangalore: స్నేహం ముసుగులో.. మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్టు
- మహిళపై సామూహిక అత్యాచారం
- కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది
- ముగ్గురు నిందితులు అజిత్, విశ్వాస్, శివులను అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వంచించి దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. నమ్మకం మాటునే మోసం దాగి ఉంటుందన్నది ఎంత నిజమో తాజాగా జరిగిన సంఘటనే నిదర్శనం. స్నేహం ముసుగులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also Read:Vijayawada: యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వాహణ.. 10 మంది మహిళలు అరెస్ట్
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఐటీ ప్రాంతమైన బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు హోటల్ టెర్రస్‌పై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ నుంచి డబ్బు, నగలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఢిల్లీకి చెందిన బాధిత మహిళ ఉపాధి కోసం వచ్చి బెంగళూరులో ఉంటుంది. హోటల్స్ లో క్యాటరింగ్ పనులు చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో స్నేహితుడిని కలిసేందుకు గురువారం హోటల్‌కు వెళ్లింది. అక్కడ కాసేపు మాట్లాడుకున్న తర్వాత నిందితులు ఆమెను హోటల్ టెర్రస్ పైకి తీసుకెళ్లారు. అనంతరం సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. స్నేహితుడే ఆమెను హోటల్ కు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
Also Read:Gold Rates: కనకం… కనికరమే లేదా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎతంటే?
బాధితురాలు ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు నిందితులు అజిత్, విశ్వాస్, శివులను అరెస్ట్ చేశారు. నిందితులు హెచ్ఎస్ఆర్ లే అవుట్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!