UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు
- యూపీలో మరో దారుణం
- ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ హత్య మరువక ముందే మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి సౌరబ్‌ను భార్య హత్య చేయగా.. తాజాగా ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను చంపింది ఓ నవ వధువు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాకు చెందిన ప్రగతి యాదవ్(22)-అనురాగ్ యాదవ్ ప్రేమికులు. గత నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లిని యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో మార్చి 5న ప్రగతి యాదవ్‌కు దిలీప్ (25) అనే యువకుడితో బలవంతంగా వివాహం చేశారు. అయితే ఈ పెళ్లిని ప్రగతి ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఇక ప్రియుడితో ఎడబాటును ఏ మాత్రం సహించలేకపోయింది. అంతే ప్రియుడు అనురాగ్ యాదవ్‌తో కలిసి కుట్ర పన్నింది. స్కెచ్‌లో భాగంగా దిలీప్‌ను చంపేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఇది కూడా చదవండి: MLAs Defection Case: పార్టీ ఫిరాయింపుల కేసు.. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన స్పీకర్..
మార్చి 19న పొలంలో దిలీప్ బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. చికిత్స కోసం బిధునాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో దిలీప్‌ను సైఫాయి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు తరలించారు. తిరిగి మార్చి 20న ఔరయ్యలోని ఆస్పత్రికి తరలించారు. ఒక్కరోజు అనంతరం దిలీప్ ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు.
అయితే ఈ ఘటనపై దిలీప్ సోదరుడు సహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లయ్యాక.. ప్రగతి.. ప్రియుడిని కలుసుకోలేకపోవడంతో భర్తను చంపాలని నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. దిలీప్‌ను హత్య చేసేందుకు రామాజీ చౌదరిని కాంట్రాక్ట్ కిల్లర్‌గా నియమించుకున్నారని.. ఇందుకోసం రూ.2లక్షలు సుఫారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. రామాజీ.. మరికొందరితో కలిసి దిలీప్‌ను పొలాలకు తీసుకెళ్లి.. అక్కడ బాధితుడిని కొట్టి కాల్చేశారన్నారు. వెంటనే నిందితులు అక్కడ నుంచి పారిపోయారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, నాలుగు లైవ్ కార్ట్రిడ్జ్లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్సు, ఆధార్ కార్డు, రూ.3,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: MMTS Incident: ఎంఎంటీఎస్‌లో లైంగిక దాడికి యత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు…
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!