దేశంలో రోజురోజుకు మహిళల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాళ్లనే కాటికి పంపేస్తున్నారు. మొన్నటికి మొన్న మీరట్‌లో భర్తను చంపి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేసింది ఓ ఇల్లాలు. అది మరువక ముందే హనీమూన్ పేరుతో మేఘాలయలో భర్తను ఒక నవ వధువు చంపేసింది. ఇలా దేశంలో ఎక్కడొక చోట నారీమణుల వికృత చర్యలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో మరో ఇల్లాలి దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Finance Scam: ఫైనాన్స్ ముసుగులో దారుణాలు.. వెలుగులోకి తండ్రీకొడుకుల బాగోతం..!
సునీల్, శశిదేవి భార్యాభర్తలు. అయితే యాదవేంద్రతో శశిదేవికి వివాహేతర సంబంధం ఉంది. ఇదంతా రహస్యంగా కానిచ్చేస్తోంది. అయితే ప్రియుడితో ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రేమికుడి సాయంతో ఆన్‌లైన్‌లో విషాన్ని ఆర్డర్ చేసింది. అనంతరం మే 13న భర్తకు పెరుగులో కలిపి చంపేసింది. అయితే సహజ మరణంగా అందరినీ నమ్మించడంతో సమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంఘటన ఉలావ్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: ఎవరైనా సరే.! నాయకులుగా ఎదగాలనుకుంటే మీ వెంటే ‘జాగృతి’..
అయితే తాజాగా శశిదేవి.. యాదవేంద్రతో కలిసి సన్నిహితంగా ఉండడంతో సునీల్ కుటుంబీకులు గమనించారు. దీంతో బాధిత కుటుంబం జూలై 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. నిందితులు నేరాన్ని అంగీకరించారు. పెరుగులో విషం కలిపి చంపేసినట్లుగా నిందితురాలు ఒప్పుకుంది. తన ప్రియుడి సాయంతో ఆన్‌లైన్‌లో విషాన్ని రప్పించి చంపేసినట్లు తెలిపింది.
అయితే సునీల్‌ను చంపడం ఇది మొదటి ప్రయత్నం కాదని.. రెండో ప్రయత్నంలో మే 13న విషం కలపడంతో చనిపోయాడని పోలీసులు తెలిపారు. శశి దేవి, ప్రేమికుడు యాదవేంద్రనీ అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితులిద్దరూ వివాహితులని, చాలా కాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నారని దర్యాప్తు అధికారులు చెప్పారు. శశి, సునీల్ వివాహం చేసుకుని 12 సంవత్సరాలు అయిందని పేర్కొన్నారు.
#WATCH | Uttar Pradesh | Firozabad City SP Ravi Shankar Prasad says, "A case was registered on July 24 in which the plaintiff from Ulau, under Tundla police station, accused her daughter-in-law and a man from the same village of poisoning her son Sunil… Both the accused have… pic.twitter.com/quly36M8bX
— ANI (@ANI) July 26, 2025