Crime News: మహిళలను దేవతలతో పోలుస్తూ ఉంటారు. వారి ఓర్పుకు, సహనానికి దండం పెడతారు. భూమాతకన్నా గొప్ప సహనం ఆడదానికి మాత్రమే సొంతమని చెప్తారు. కానీ.. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడవారు.. మహిళా జాతికే మాయని మచ్చగా మారుతున్నారు. డబ్బుకోసం కొందరు.. శృంగారం కొస్తుండం కొందరు.. వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. ఎదుటువారు చెప్పేది మన మంచికే అన్న ఇంగితం కూడా లేకుండా కోపోద్రేకంలో సొంతవారిని మట్టుబెడుతున్నారు. ఇక్కడ మనం చెప్పుకొనే మహిళ కథ వింటే.. ఛీఛీ.. నువ్వసలు ఆడదానివేనా అని అనేక మానరు. వ్యభిచారం వద్దు అన్నందుకు సొంత భర్తను కడతేర్చింది ఒక కసాయి. అక్కడితో ఆగకుండా మహానటి నాటకాలు ఆడింది. తన భర్తను ఎవరో చంపారు అని కల్లబొల్లి ఏడుపు పోలీసుల వద్ద కార్చింది. ఇక ఆ ఓవర్ యాక్షన్ ఆమెను పట్టించేసింది. ప్రస్తుతం కటకటాల వెనుక ఊచలు లెక్కిస్తోంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జీడిమెట్ల పియస్ పరిధి సంజయ్ గాంధీ నగర్ కు చెందిన కవిడెదేవి సురేష్, రేణుక భార్యాభర్తలు. సురేష్ ఆటో డ్రైవర్. కొంత కాలంగా రేణుక వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈ విషయమై భర్త సురేష్ అనేకసార్లు గొడవపడ్డాడు. అది మంచి పని కాదని, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నామని బతిమిలాడాడు. అయినా రేణుక మాట వినలేదు. ఇక దీంతో సురేష్ ఎదురుతిరిగి భార్య బాగోతం అందరికి చెప్పేస్తానని బెదిరించాడు. దీంతో ఎక్కడ వ్యాపారం ఆగిపోతుందో అని సొంత భర్తను చంపడానికి ప్లాన్ వేసింది రేణుక. పధకం ప్రకారం సురేష్ కు ఆదివారం రాత్రి మద్యం తాగించి, తాను కూడా తాగింది. మద్యం మత్తులో తూలుతున్న సురేష్ మెడకు తన స్నేహితురాలు దేవి సాయంతో చున్నీ చుట్టి ఇద్దరు కలిసి హత్యచేశారు. ఇక భర్తను హత్య చేశాక పోలీసుల వద్దకు వెళ్లి యాక్టింగ్ మొదలుపెట్టింది. తన భర్తను ఎవరో చంపి ప్లాస్టిక్ సంచిలో పెట్టి వెల్లిపోయారని కట్టుకధ అల్లి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడానికి ప్రయత్నించగా తన భర్త మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయొద్దని ఓవర్ యాక్షన్ చేసింది. ఇక అమ్మగారి ఓవర్ యాక్షన్ కు అనుమానం వచ్చిన పోలీసులు నాలుగు తగిలించగానే నిజం మొత్తం కక్కేసింది. తన స్నేహితురాలు దేవి సాయంతో తన భర్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.