ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది..యువతిని కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారం చేశారు..ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.. తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది..
వివరాల్లోకి వెళితే..ఉత్తర ప్రదేశ్ లోని జైసింగ్ పూర్ కు చెందిన ఓ విద్యార్థినిపై బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు కన్నేశాడు. ఈ ఏడాది జనవరి 30న తన స్నేహితుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆ విద్యార్థినిని గుజరాత్ లోని సూరత్ కు తీసుకువెళ్లారు. మరోవైపు విద్యార్థిని కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.. ఒకవ్యక్తి పై అనుమానం ఉందని, అమ్మాయిని వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు…
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.. అయితే ఆ దుండగులు యువతిని తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.దీంతో బాధితురాలు ఎదురు తిరిగింది. కోపానికి వచ్చిన నిందితుడు ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని అమ్మాయిని కిడ్నాప్ చేసిన మహా వీరే స్వయంగా బాధితురాలు తండ్రికి ఫోన్ చేశాడు. అతని కూతురు తీవ్ర గాయాల పాలయిందని తెలిపాడు. దీంతో మార్చి 29న బాధితురాలు తండ్రి సుల్తాన్పూర్ పోలీసులకు పరిస్థితి చెప్పి, యువతిని వెతికి ఆసుపత్రికి తరలించారు..గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు.. గత రెండు నెలలుగా చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది.. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.. నిందితులను ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు..