ఓ కుర్రాడు తన స్నేహితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు.. కానీ తిరిగి ఇవ్వలేక పోయాడు.. దాంతో తన స్నేహితులు విచక్షణారహితంగా ప్రవర్తించారు.. ఫ్రెండ్ అని కూడా చూడకుండా బట్టలను ఊడదీసి దారుణంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. అతన్ని అలా ఫోటోలు, వీడియోలు తీస్తూ రాక్షస ఆనందం పొందారు… ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది..
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగు చూసింది.. ఝాన్సీ పట్టణానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ పార్కులో సదరు విద్యార్థి తన స్నేహితులతో కలిసి కూర్చున్నాడు. డబ్బులు తీసుకున్న ఫ్రెండ్ తన నలుగురు సహచరులతో కారులో పార్కు వద్దకు చేరారు.
ఆ తర్వాత అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారు.. నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడున్న ఇద్దరు, కారులో ఉన్న నలుగురు కలిసి.. ఆ విద్యార్థికి బలవంతంగా మద్యం తాగించారు. డబ్బులు అడుగుతావా..? అంటూ అతనిపై విరుచుకుపడ్డారు. బట్టలూడదీసి తమ వద్ద ఉన్న బెల్ట్‌లు, కర్రలతో చితకబాదారు. ఆ తతంగాన్ని అంతా తమ ఫోన్లలో చిత్రీకరించారు. గంట పాటు వేధించిన తర్వాత ఆ బాలుడు ఎలాగో తప్పించుకున్నాడు..
అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, బాధిత బాలుడు తన పేరెంట్స్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో కొంత మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం కఠిన చర్యలు తీసుకొనున్నట్లు పోలీసులు తెలిపారు..