Man Ate Women Parts:ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ లేదు. అసలు మనుషులను ఎందుకు చంపుతున్నారో కూడా తెలియడం లేదు. ఇంకొంతమంది చేసే హత్యల గురించి వింటే అసలు వీళ్లు మనుషులా.. మృగాలా..? అన్న అనుమానం కూడా రాకమానదు. సాధారణంగా మనుషులను పీక్కుతినే వారిని అఘోరాలు అంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకొనే వ్యక్తి వారికి మించిన మృగం అని చెప్పొచ్చు. అమ్మాయిలను అతి కిరాతకంగా చంపి.. వారి గుండెను వేరుచేసి దాన్ని వండుకొని తింటున్నాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో వారం క్రితం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Marriage : పెళ్లికెందుకు రాలేదన్నందుకు ‘చావు’ దెబ్బలు కొట్టిన పెళ్లాం
అమెరికాలోని ఓక్లహోమా అనే పట్టణంలో లారెన్స్ పాల్ ఆండర్సన్ అనే 42 ఏళ్ళ వ్యక్తి నివసిస్తున్నాడు. మొదటి నుంచి అతను డ్రగ్స్ కు అడిక్ట్ అవ్వడమే కాకుండా డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు కూడా పట్టుబడ్డాడు. ఇక్కడితో ఆగకుండా హత్యలకు కూడా పాల్పడ్డాడు. కొన్నిరోజుల క్రితం లారెన్స్ తన పక్కింట్లో ఉన్న యువతిని తన ఇంటికి పిలిచి హత్య చేశాడు. అనంతరం.. ఆమె గుండెను కోసి, వండుకొని తిన్నాడు. ఇక యువతీ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు లారెన్స్ ఇంటికి వచ్చి చూసి షాక్ అయ్యారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి విచారించగా.. 2020 లో తన అత్తను చంపి.. ఇలాగే చేసానని, ఆ తరువాత ఒక నాలుగేళ్ళ చిన్నారిని చంపి ఆమె గుండె వండుకొని తిన్నట్లు తెలిపాడు. ఆ మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక తాజాగా అతడికి జీవిత ఖైదు ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హత్య, దాడి మరియు శరీర భాగాన్ని తినడం వంటి నేరాలకు అండర్సన్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.