Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణమైన సంఘటన జరిగింది. సభ్య సమాజం తలదించుకునే పని చేసింది ఓ తల్లి. కొడుకు అని చూడకుండా ప్రియుడి కోసం హత్యకు పాల్పడింది కసాయి తల్లి. అక్రమ సంబంధం, కామం, డబ్బు కోసం కన్న కొడుకునే హతమార్చింది. కాన్పూర్ దేహాత్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికుల్ని నివ్వెరపరించింది. అంగద్‌పూర్ నివాసి అయిన మమతా సింగ్, తన ప్రియుడు మయాంక్ కటియార్, అతడి సోదరుడు రిషి సహాయంతో తన 25 ఏళ్ల కుమారుడు ప్రదీప్ సింగ్‌ను చంపినట్లు పోలీసులు తెలిపారు.
మమతా సింగ్ భర్త చనిపోయిన తర్వాత, ఆమెకు మయాంక్‌తో సాన్నిహిత్యం పెరిగింది. ప్రదీప్ తన తల్లి సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నాడు. కానీ తన ప్రేమికుడితోనే ఉండాలని మమతా సింగ్ వాదించేది. దీంతో ఆమె తన కొడుకును అంతం చేయాలని నిర్ణయించుకుంది. హత్యకు ముందు నుంచే పక్కా పథకంలో హత్య చేయాలని భావించింది. దీని తర్వాత, తన కొడుకు పేరు మీద కోటి రూపాయలకు పైగా విలువైన నాలుగు బీమా పాలసీలు తీసుకుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఆమె తన కొడుకును హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Amazon layoffs: అమెజాన్ ఉద్యోగులకు నిద్రలేని రాత్రులు.. అందరిలో “లేఆఫ్” భయం..
సంఘటన జరిగిన రోజున మమతా, ఆమె ప్రియుడు భోజనం పేరుతో ప్రదీప్‌ను ఇంటికి పిలిచారు. తిరిగి వస్తుండగా మయాంక్, రిషి అనే వ్యక్తులు ప్రదీప్‌పై సుత్తితో దాడి చేశారు. దీంతో అతనున అక్కడిక్కడే మరణించాడు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు హైవేపై మృతదేహాన్ని పడేశారు. అయితే, పోస్టుమార్టంలో అతడి తలపై అనేక పగుళ్లు ఉండటంతో కొట్టి చంపినట్లుగా నిర్ధారించారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా నేరం జరిగిన చోట మమతా, ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుల నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామస్తులు నివ్వెరపోయారు. ప్రదీప్ తన తల్లిని ఎంతగానో ప్రేమించే వాడని గ్రామస్తులు చెబుతున్నారు. మమతా డబ్బుల కోసం ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదని ప్రదీప్ తాత జగదీష్ నారాయణ్ విలపించారు.