UP: తన భార్య వేరే వ్యక్తితో లేచిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. తన నలుగురు పిల్లలతో కలిసి అను యమునా నదిలోకి దూకినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం తన భార్యతో జరిగిన వివాదం తర్వాత సల్మాన్ ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడు. దూకడానికి ముందు తన వీడియోను రికార్డ్ చేసి, తన సోదరి గులిస్టాకు పంపాడు. తన భార్య ఖుష్నూ, ఆమె లవర్ తన ఆత్మహత్యకు బాధ్యులు అని అందులో పేర్కొన్నాడు.
Read Also: Crime News: ఆరేళ్ల ప్రేమ.. 6 రోజులు కూడా కాపురం చేయక ముందే!
శనివారం, గులిస్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని డైవర్లతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పిల్లలను మహక్ (12), షిఫా (5), అమన్ (3), ఎనిమిది నెలల శిశువు ఇనైషాగా గుర్తించారు. సల్మాన్, ఖుష్నుమా వివాహం చేసుకుని 15 ఏళ్లు అయిందని, అయితే ఇటీవల నెలల్లో తరుచుగా కుటుంబంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. శుక్రవారం కూడా గొడవ జరిగిందని, ఆ తర్వాత ఖుష్నుమా తన ప్రియుడితో పారిపోయిందని తెలుస్తోంది. ఈ సంఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.