Shocking: బిడ్డ లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు చీల్చిన కసాయి భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి కసాయిలా ప్రవర్తించాడు. తనకు పుట్టబోయే బిడ్డ మగ పిల్లాడా, ఆడ పిల్ల అని లింగ నిర్ధారణ చేసేందుకు గర్భిణి అయిన భార్య కడుపును చీల్చాడు. ఈ ఘటన యూపీలోని బదౌన్‌లో 2020లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. బదౌన్‌లోని సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటున్న పన్నాలాల్ 2020 సెప్టెంబర్ నెలలో తన భార్య కడుపును కొడవలితో కోశాడు.
ఈ జంటకు 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి అప్పటికే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే, పన్నాలాల్ తనకు మగబిడ్డ పుట్టాలని తరుచూ భార్యతో గొడవ పడేవాడు. దంపతుల గొడవ గురించి భార్య అనిత కుటుంబానికి తెలిసి, పన్నాలాల్‌ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అతను అతనిత విడాకులు ఇచ్చి, వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు.
Also Read
Read Also: Laila Khan Murder Case: బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసు.. సవతి తండ్రికి మరణశిక్ష విధించిన కోర్టు..
ఈ ఘటన జరిగిన రోజున భార్యభర్తలు మళ్లీ పుట్టబోయే బిడ్డ విషయంలో గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన పన్నాలాల్ అనిత కడుపును కోసి మగపిల్లాడా, ఆడ పిల్లా అని ఆమె కడుపును కోశాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, పన్నాలాల్ ఆమె కడుపును కొడవలిలో కోసి తెరిచాడు. ఆ సమయంలో అనిత ఏడు నెలల గర్భిణి. చాలా లోతుగా గాయం చేశాడని, కడుపులోని పేగులు బయటకు వచ్చాయని అనిత కోర్టుకు తెలిపింది.
ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె గాయాలతో అరుస్తూ బయటకు పరిగెత్తింది. సమీపంలో దుకాణంలో పనిచేసే ఆమె సోదరుడు ఆమె అరుపులు విని వచ్చే సమయానికి పన్నాలాల్ అక్కడి నుంచి పారిపోయాడు. అనితను ఆస్పత్రికి తరలించారు. ఆమె దాడి నుంచి బయటపడగా.. గర్భంలోని ‘‘మగ శిశువు’’ని మాత్రం రక్షించలేకపోయారు. మరోవైపు తన సోదరులతో ఆస్తి తగాదా ఉన్నందుకు తనపై తప్పుడు కేసు పెట్టేందుకు అనిత తనపై తానే దాడి చేసుకుందని పన్నాలాల్ కోర్టులో వాదించాడు.
తాజావార్తలు
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!