Uttar Pradesh: రెచ్చిపోయిన హిజ్రాలు.. ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి
- ఉత్తర ప్రదేశ్‌లో దారుణం
- ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడికి పాల్పడ్డ హిజ్రాలు
- పోలీస్ అధికారిని రైల్వే ప్లాట్ ఫామ్‌పై పరిగెత్తించి కొట్టిన హిజ్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది హిజ్రాలు ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. పోలీస్ అధికారిని రైల్వే ప్లాట్ ఫామ్‌పై పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రయాణికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని అన్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి మహ్మద్ అనే ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ తన కొలీగ్స్‌తో కలిసి డియోరియా రైల్వే స్టేషన్ దగ్గర అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ ఐ మహ్మద్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో హిజ్రాల గుంపు ఆగ్రహానికి గురైంది. వెంటనే అందరూ ఒక చోట గుమిగూడారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 1 దగ్గర అల్లర్లు మొదలెట్టారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తించంటం.. జనరల్ బోగీలలోకి వెళ్లి డబ్బులు ఇవ్వలేని పేద వాళ్ళను సైతం కాళ్లతో ఎగిరెగిరి తన్నడం మొదలెట్టారు. ఆ విషయం ఆర్ పి ఎఫ్ సిబ్బందికి తెలిసింది.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
హిజ్రాలు తమనుంచి దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంటున్నారని కొంతమంది ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాట్ ఫామ్‌పై తిరుగుతున్న హిజ్రాలను మహ్మద్ పిలిచి, దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని చెప్పాడు. ఇకపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నాడు. మహ్మద్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో హిజ్రాల గుంపు ఆగ్రహానికి గురైంది. వెంటనే అందరూ ఒక చోట గుమిగూడారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 1 దగ్గర అల్లర్లు మొదలెట్టారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తించటం మొదలెట్టారు.
ఈ సమాచారం మహ్మద్‌కు చేరింది. మహ్మద్ వెంటనే మరికొంతమంది పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లాడు. వారిని చూడగానే హిజ్రాల కోపం కట్టలు తెంచుకుంది. పోలీసుల లాఠీని లాక్కుని వారిపైనే దాడికి దిగారు. మహ్మద్‌ను ప్లాట్ ఫామ్‌పై పరిగెత్తించి మరీ కొట్టారు. అంతటితో వారు ఆగలేదు. ఆర్‌పీఎఫ్ ఆఫీసుపై కూడా దాడికి దిగారు. విధ్వంసం సృష్టించారు. విషయం తెలుసుకున్న జీఆర్‌పీ పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే హిజ్రాలు అక్కడినుంచి పారిపోయారు. దాడికి పాల్పడ్డ ఇద్దరు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!