Two People Robbed 7 Lakhs From A Man Near ATM Center In Hyderabad: ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అతని వద్ద నుంచి రూ.7 లక్షలు తీసుకొని.. అక్కడి నుంచి పారిపోయారు. వాళ్లను పట్టుకోవడానికి ఆ వ్యక్తి ప్రయత్నించాడు కానీ, ఫలితం లేకుండా పోయింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి సమయం కావడంతో.. ఇతరుల సహాయం కూడా కరువైంది. దీంతో.. చేసేదేమీలేక ఆ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ ముజీద్ అనే వ్యక్తి బషీర్ బాగ్‌లో నివాసం ఉంటున్నాడు. వృత్తి రీత్యా వాచ్‌లు, బెల్టులు విక్రయిస్తుంటాడు. అయితే.. అతనికి పెద్దగా ఇన్‌కమ్ రాదు. దీంతో.. కమీషన్ల కోసం ఆన్‌లైన్‌లో నగదును కూడా డిపాజిట్ చేస్తుంటాడు.
Telangana: బండి కొంప ముంచిది అదే.. కిషన్‌రెడ్డికి కలిసి వచ్చింది ఇదే..!
కట్ చేస్తే.. సోమవారం రాత్రి అబ్దుల్ ముజీద్‌కి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మరో వ్యక్తితో తాను రూ.7 లక్షల నగదు పంపించానని, ఆ డబ్బుల్ని ఏటీఎంలో డిపాజిట్ చేయాలని చెప్పాడు. దీంతో.. అబ్దుల్ ఆ డబ్బులు తీసుకొని, వాటిని డిపాజిట్ చేసేందుకు నారాయణగూడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం వద్దకు వెళ్లాడు. అతడు డబ్బులు డిపాజిట్ చేస్తుండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హఠాత్తుగా ఊడిపడ్డారు. అబ్దుల్ వద్దనున్న రూ.7 లక్షలు తీసుకొని, అక్కడి నుంచి మెరుపుతీగ లాగా మాయం అయిపోయారు. వాళ్లను పట్టుకోవడానికి కొంతదూరం వెంబడించాడు కానీ, ఫలితం లేకుండా పోయింది. రాత్రి సమయం కావడం వల్ల.. సహాయం కోసం ఎవ్వరూ లేరు. దాంతో.. అబ్దుల్ ముజీద్ దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేస్తున్నారు.
Revolutions: ప్రపంచాన్ని మార్చేసిన టాప్-10 విప్లవాలు